Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్‌కు మొజ్తబా వార్నింగ్..

  • నా తండ్రి మరణానికి ప్రతీకారం తప్పకుండా ఉంటుంది..
  • అమెరికా, ఇజ్రాయిల్‌లకు వార్నింగ్ ఇచ్చిన మొజ్తబా ఖమేనీ..
Mojtaba Khamenei

Mojtaba Khamenei

Mojtaba Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. అయితే, తన తండ్రి హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కుమారుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మరణించారు. దాదాపుగా నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియలు ఇటీవల ముగిశాయి. అయితే, అంత్యక్రియల తర్వాత మొజ్తబా ఈ సందేశాన్ని విడుదల చేశారు.

‘‘మా అమర నాయకుడు అలీ ఖమేనీతో పాటు ఈ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి అమరవీరుడి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు’’ అని అమెరికా, ఇజ్రాయిల్‌లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారం అనేది తప్పకుండా జరుగుతుందని, అది తనపై లేదా ఇతర అధికారులపై ఆధారపడి ఉండదని ఆయన స్పష్టం చేశారు. తాము ఉన్నా లేకపోయినా ఆ రోజు తప్పకుండా వస్తుందని, ప్రతీకారం అనివార్యమని అన్నారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలకు మొజ్తబా ఖమేనీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్, ఇరాక్‌లోని టెహ్రాన్, కోమ్, నజాఫ్, కర్బలా, మష్హద్ నగరాల్లో లక్షలాది మంది పాల్గొనడం శత్రువులకు గట్టి సందేశమని ఆయన పేర్కొన్నారు.