Site icon NTV Telugu

Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..

Iran War (1)

Iran War (1)

Iran War: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ అన్ని దేశాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఇంధన భద్రత దెబ్బతింది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేంది. ప్రపంచ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మార్గం గుండా వెళ్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. ఇటీవల, థాయ్ జెండా ఉన్న కార్గో షిప్ భారత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తున్న సమయంలో ఇరాన్ దాడి చేసింది. అమెరికన్ నౌకల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తోంది.

Read Also: GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..

ఇదిలా ఉంటే, కొత్తగా ఇరాన్‌కు సుప్రీం లీడర్ అయిన మోజ్తాబా ఖమేనీ పదవి చేపట్టిన తర్వాత తొలి ప్రకటనలోనే ‘‘హార్ముజ్’’ను ప్రస్తావించారు. అమెరికాకు వ్యతిరేకంగా హార్ముజ్‌ను మూసే ఉంచాలని, మధ్యప్రాచ్యంలోని తమ పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఖమేనీ ప్రకటనను ఆ దేశ మీడియా ప్రకటించింది. ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలు పనిచేస్తూనే ఉంటే, వాటిపై దాడులు చేస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా వాటిని మూసేయాలని హెచ్చరించారు.

యుద్ధంలో మరణించిన వారి తరుపున ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. ఇరాన్ తన శత్రువు నుంచి పరిహారం పొందుతుందని అన్నారు. పరిహారం ఇవ్వకుంటే శత్రువుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తామని చెప్పారు. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ హత్య గురించి మాట్లాడుతూ.. అతను ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడే వారని, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అమరవీరులు రక్తానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని అన్నారు.

Exit mobile version