Site icon NTV Telugu

Michelle Obama: విడాకులపై తొలిసారి స్పందించిన మిచెల్ ఒబామా

Michelleobama2

Michelleobama2

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒబామాతో కలిసి మిచెల్ రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణమైంది. జనవరిలో మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు హాజరు కాలేదు.. అనంతరం డొనాల్ట్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరు కాకపోవడంతో పుకార్లకు బలం చేకూరింది. ఈ మధ్య ఒబామా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇబ్బందులు ఉన్నట్లుగానే చెప్పారు. తాజాగా మిచెల్ ఒబామా కూడా ఈ వదంతులపై నోరు విప్పారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu: గొంతులో చేప చిక్కుకుని జాలర్ మృతి

వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పాడ్‌కాస్ట్‌లో నటి సోఫియా బుష్‌తో మిచెల్ ఒబామా సంభాషించారు. ఈ సందర్భంగా విడాకులపై వస్తు్న్న వార్తలకు బ్రేక్ వేశారు. అలాంటిదేమీ లేదని మిచెల్ తోసిపుచ్చారు. తన వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా చెప్పారు. అందుకే బయటికి ఎక్కడికి వెళ్లడం లేదని ఆమె తెలిపారు. వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన దగ్గర నుంచి ఈ ఎనిమిదేళ్లలో తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. కుమార్తెలు పెద్దవాళ్లు కావడంతో బాధ్యతలు పెరిగాయన్నారు. తన ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడానికి స్వేచ్ఛ లభించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఒబామా దంపతులకు 32 సంవత్సరాలు వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒబామా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు.

ఇది కూడా చదవండి: Vizag Mayor: మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్‌..! దేశం దాటిన కార్పొరేటర్లు..

 

Exit mobile version