Melania Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో 20 ఏళ్ల నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెంట్రుకవాసిలో బుల్లెట్ దూసుకెళ్లింది. కుడిచెవికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌కి రక్షణగా నిలిచారు. దాడికి పాల్పడిన నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్‌ని అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటనపై రిపబ్లికన్ పార్టీ నేతలు అధికార డెమోక్రటిక్ పార్టీని, అధ్యక్షుడు జో బైడెన్‌ని విమర్శిస్తున్నారు.
Read Also: Vijayawada Cyber Crime: వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టి ఫోన్లు.. కేటుగాళ్ల కొత్త వ్యూహం
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తన భర్తపై జరిగిన దాడిపై స్పందించారు. ఈ హింసాత్మక దాడిలో బుల్లెట్ నా భర్త డొనాల్డ్ ట్రంప్‌కి తాకడం చూసినప్పుడు నా జీవితం, బారన్ జీవితం వినాశకరమైన మార్పు అంచున ఉన్నాయని గ్రహించానని, నా భర్తను రక్షించడానికి వచ్చిన తమ ప్రాణాలు పణంగా పెట్టిన ధైర్యవంతులైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులకు ఆమె కృతజ్ఞుతలు చెప్పారు. ఈ దారుణమైన చర్యతో బాధపడుతున్న అమాయక బాధిత కుటుంబాలకు, నా ప్రగాఢ సానుభూతిని సవినయంగా తెలియజేస్తున్నానని చెప్పారు. మార్పు పవనాలు వచ్చాయని, మాకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తు్న్నానని అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా ముందుకు వచ్చిన మీలో ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.
Melania Trump, former US President Donald Trump's wife releases a statement on the attack on Donald Trump.
When I watched that violent bullet strike my husband, Donald, I realized my life, and Barron's life, were on the brink of devastating change. I am grateful to the brave… pic.twitter.com/lyLmBhU2Pr
— ANI (@ANI) July 14, 2024