పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఆ దేశంలో యధేచ్చగా తిరుగుతున్నారు. వేల కోట్ల రూపాయలను ఉగ్రవాదులను తయారు చేయడానికి కొన్ని బడా సంస్థలు పెట్టుబడిగా పెడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సైన్యం హతమార్చిన ఒసామాబీన్ లాడెన్ సహా ఎంతో మందికి ఆ దేశం ఆశ్రయం ఇస్తోంది. రక్షణ కల్పిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి ప్రధాన కుట్రదారుడైన మసూజ్ అజార్‌కు పాక్ ప్రభుత్వం రక్షణ కలిగిస్తోంది. ఉగ్రవాది అజార్ ప్రస్తుతం బహవల్‌పుర్‌లో రెండు విలాసవంతమైన విల్లాల్లో నివశిస్తున్నారు. ఈ రెండు విల్లాలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్నాయి. పైగా ఈ రెండు భవనాలకు పాక్ సైన్యం రక్షణ కల్పిస్తున్నది. అంతేకాదు, రెండు భవంతులు రెండు రకాల మసీదులకు సమీపంలో ఉండటంతో మరింత రక్షణ అని చెప్పొచ్చు.
Read: “సర్కారు వారి పాట” టీజర్ అప్డేట్
గతంలో కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బీన్ లాడెన్ అబోటాబాద్‌లోని జనసంచారం పెద్దగాలేని ప్రాంతంలో నివశించడం వలన అమెరికా సైన్యం అతడిని హతమార్చింది. అజార్‌కు కూడా ఇండియా నుంచి అలాంటి ముప్పు ఉందని అనుమానించిన పాక్ ప్రభుత్వం ఆయన్ను జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలో ఉంచింది. పైగా బహవల్‌పుర్ అజార్ పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో పూర్తి పట్టు ఉన్నది. రక్షణ ఉంటుందనే ఉద్దేశంలో ఆక్కడ తలదాచుకుంటున్నాడు.