దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం నరా నగరంలోని ఓ వీధిలో ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరపగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. నారా నగరానికి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి మాజీ ప్రధానిపై కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని ఘటనాస్థలం వద్దే పట్టుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఓ తుపాకీని పోలీసులు గుర్తించారు. ఆ ఆయుధంతోనే దుండగుడు కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు తెలుస్తోంది. అతడు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అని జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
PM Modi: షింజోపై దాడిని ఖండించిన భారత్.. మనోవేదనకు గురయ్యానని మోదీ ట్వీట్..
షింజో అబెను అత్యంత సమీపం నుంచే కాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అబెకు వెనుకవైపు 10 అడుగుల దూరంలోకి వచ్చి నిందితుడు యమగామి షార్ట్‌గన్‌తో రెండుసార్లు కాల్పులు జరిపినట్లు జపాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది క్షమించరాని చర్య అంటూ.. ఈ పరిస్థితిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారంటూ ఫుమియో కిషిడా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జపాన్ ప్రధాని కాల్పుల అనంతరం అతడు పారిపోతున్న దృశ్యాలు.. పోలీసులు పట్టుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Big Breaking: దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుర్మరణం
అనేక మంది ప్రపంచ నేతలు షింజో అబే మరణం పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన హింసాత్మక దాడి గురించి విని దిగ్భ్రాంతి చెందామని.. అతని కుటుంబం, జపాన్ ప్రజలకు అండగా ఉంటామని వైట్ హౌస్ ప్రకటించింది.
https://twitter.com/Global_Mil_Info/status/1545249495398719488