Python As Weapon: పెంపుడు పైథాన్‌ను ఆయుధంగా వాడి.. వ్యక్తిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Python As Weapon: తమ పెంపుడు జంతువులను జనాలు ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వాడికి ఎలాంటి హాని కలగకుండా, ఈగ కూడా వాలకుండా, తమ సొంత పిల్లల్లాగే చూసుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు పైథాన్‌ను అడ్డం పెట్టుకొని, వ్యక్తుల్ని బెదిరించాడు. అంతటితో ఆగకుండా.. దాన్ని తన ఆయుధంగా మార్చుకొని, ఓ వ్యక్తిపై దాడి చేశాడు. అదేదో నడుముకు వేసుకునే బెల్టు అన్నట్టుగా.. ఆ పైథాన్‌తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో.. ఆ వ్యక్తి వెనకడుగు వేశాడు. పాపం ఆ పైథాన్.. దాన్ని విడిచిపెట్టగానే, బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగు తీసింది. ఈ ఘటన కెనడాలోని టొరంటోలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Wrestlers : ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేస్తాం.. ఇండియన్ రెజ్లర్స్ కీలక నిర్ణయం..
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
లారెనియో అవిలా అనే 45 ఏళ్ల వ్యక్తి తన పెట్ పైథాన్‌ని పట్టుకొని, టొరంటో వీధుల్లోకి వచ్చాడు. తన పని తాను చేసుకోకుండా.. పైథాన్‌ను చూపిస్తూ, వీధుల్లో వెళ్తున్న వ్యక్తుల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వారించగా.. నాకే చెప్తావా అంటూ అతనితో దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా.. తన పైథాన్‌ని ఆయుధంగా మార్చుకొని, దాంతో ఆ వ్యక్తిని కొట్టడం ప్రారంభించాడు. తనని కొట్టొద్దని ఎంత చెప్తున్నా.. లారెనియో మాత్రం ఆగలేదు. తన పైథాన్‌తో ఆ వ్యక్తిని కొడుతూనే ఉన్నాడు. రోడ్డు మీదే పడేసి మరీ దాడికి పాల్పడ్డాడు. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకోగానే.. పైథాన్‌ను పడేశాడు. పాపం ఆ కొండచిలువ.. తనకు మోక్షం దక్కిందని భావించి, అక్కడి నుంచి వెంటనే పారిపోయింది. మరోవైపు.. లారెనియో తన తప్పేమీ లేదన్నట్టుగా, పోలీసుల ముందు అమాయకంగా నటించడానికి ప్రయత్నించాడు. నేల మీద వాలిపోయాడు.
Ex-Girlfriend Intimate Photos: మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని వైరల్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
అయితే.. ఈ వ్యవహారంలో లారెనియోదే తప్పు కావడంతో, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిపై దాడి చేయడంతో పాటు ఓ ప్రాణి (పైథాన్)ని ఇబ్బందులకు గురి చేసినందుకు గాను.. అతనిపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచారు కూడా. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. పైథాన్‌తో ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తమకు ఫోన్ కాల్ వచ్చిందని, దీంతో వెంటనే తాము ఆ ప్రాంతానికి చేరుకున్నామని తెలిపారు. తాము అక్కడికి వెళ్లి చూస్తే.. ఇద్దరు వ్యక్తులు పరస్పర దాడులు చేసుకోవడాన్ని చూశామని, ఇందులో కొండచిలువను ఆయుధంగా వినియోగించారని చెప్పారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 14 మిలియన్లకు పైగా ఆ వీడియోకి వ్యూస్ వచ్చాయి.
Dude uses his pet snake as a weapon during street fight in Toronto 😳 pic.twitter.com/T2lLKaLe4E
— Crazy Clips (@crazyclipsonly) May 13, 2023
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!