Ex-Girlfriend Intimate Photos: మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని వైరల్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Teen Arrested For Circulating Ex-Girlfriend Intimate Photos: తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో.. తామిద్దరం కలిసున్నప్పుడు దిగిన ఇంటిమేట్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అంతేకాదు.. ఫేక్ జీ-మెయిల్ నుంచి ఆ ఫోటోలను తన మాజీ ప్రియురాలికి కూడా పంపించాడు. అది చూసి ఖంగుతిన్న ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో.. అధికారులు రంగంలోకి దిగి, అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి క్రేజీ అప్డేట్.. ఆరోజు దద్దరిల్లిపోవాల్సిందే!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
సౌత్ వెస్ట్ ఢిల్లీలోని లక్ష్మీ విహార్‌లో నివసిస్తున్న మానస్ లహోరా అనే 19 ఏళ్ల యువకుడు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 2021లో ఇతడు ఓ యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించడంతో.. ఇద్దరు కలిసి సరదాగా గడిపారు. శారీరకంగా కూడా కలిశారు. వీరి ప్రేమకథ సజావుగానే సాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆ యువతి అతడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే, కారణం చెప్పకుండానే బ్రేకప్ చెప్పేసింది. తన ప్రియురాలికి దగ్గరయ్యేందుకు అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అప్పటి నుంచి అతడు తన మాజీ ప్రియురాలిపై కక్ష పెంచుకున్నాడు. తనని వదిలేసి వెళ్లిపోయినందుకు, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తొలుత ఫేక్ జీ-మెయిల్ క్రియేట్ చేసి.. దాని ద్వారా ఆ యువతికి, అలాగే ఆమె కుటుంబ సభ్యులకు ఆమెకు సంబంధించిన నగ్న ఫోటోలు పంపాడు. అనంతరం సోషల్ మీడియాలో లీక్ చేసి, వైరల్ చేశాడు.
Akhil Akkineni : ఏజెంట్ సినిమా రిజల్ట్‌పై స్పందించిన అఖిల్ అక్కినేని
తన ఇంటిమేట్ ఫోటోలు ఇలా వైరల్ అవ్వడం చూసి ఖంగుతిన్న ఆ యువతి.. తన మాజీ ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీన తమకు ఫిర్యాదు అందిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తాము మే 14వ తేదీన మానస్‌ను అరెస్ట్ చేశామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. మాజీ ప్రియురాలు తనకు బ్రేకప్ చెప్పినందుకే, మానస్ ఈ పని చేశాడని నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!