Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- ఆఫ్రికా దేశం మాలిలో భారీ ఉగ్రవాద దాడి..
- దేశ రక్షణ మంత్రిని హతమార్చిన ఉగ్రవాదులు..
- పలు నగరాలలో పేలుళ్ల విధ్వంసం..
- అల్ ఖైదా ఉగ్రవాదులు, తిరుగుబాటుదారుల దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Attack: ఆఫ్రికా దేశం మాలిలో భారీ ఉగ్రవాద దాడి జరిగింది. అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలు, లువారెగ్ తిరుగుబాటుదారులు దేశంలోని పలు ప్రాంతాలపై ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దేశ రక్షణ మంత్రి సాడియో కామారా మరణించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల సంవత్సరాల్లో జరిగిన భారీ ఉగ్రదాడిగా పేర్కొంటున్నారు.
Read Also: LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
మాలి రక్షణ మంత్రి సాడియో కామారా నివసించే కాటి సైనిక స్థావరంపై జెఎన్ఐఎం మిలిటెంట్లు దాడి చేశారని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్ఎఫ్ఐ నివేదించింది . ఆయన ఇంటిపై దాడి జరగగా మరణించినట్లు వెల్లడించింది. శనివారం మొదలైన దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. రాజధాని బమాకోలోని ఒక సైనిక స్థావరం వద్ద కూడా దాడి జరిగింది. మాలిలో ఉత్తరాన ఉన్న కిడాల్ నగరంలో చాలా కాలంగా ప్రభుత్వం, తిరుగుబాటుదారులకు పోరాటం జరుగుతోంది. అయితే, తాజా దాడుల తర్వాత ప్రభుత్వం నుంచి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు.
ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో మరణాల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇన్నాళ్లు మారుమూల గ్రామాలను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు, ఈసారి ఏకంగా రాజధాని బమాకోలోని సైనిక స్థావరాన్ని కూడా టార్గెట్ చేశారు. రక్షణ మంత్రిని దాడిలో చంపేశారు. ఒకేసారి పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. మాలిలో ప్రస్తుతం సైనిక ప్రభుత్వం ఉంది. మరోవైపు అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ జేఎన్ఐఎం, ఉత్తర మాలిలో తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని టువారెగ్ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!