Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం..
- మీకే ఎందుకు ఇలా జరుగుతోందని ప్రశ్నించిన విలేకరి..
- ‘‘లింకన్’’ ఉదాహరణతో ట్రంప్ సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: మూడేళ్లలో మూడోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. తాజాగా, శనివారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’ విందులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన తర్వాత ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఇది ఊహించని పరిణామం’’అని అన్నారు.
అయితే, విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్న మాత్రం అన్నింటి కన్నా ప్రత్యేకంగా నిలిచింది. ఫాక్స్ న్యూస్ విలేకరి పీటర్ డూసీ.. ‘‘మీకే ఇలా పదే పదే ఎందుకు జరుగుతుందని భావిస్తున్నారు?’’ అని కాల్పుల ఘటన గురించి ప్రశ్నించారు. దీనికి ట్రంప్ ‘‘అబ్రహం లింకన్’’ను ఉదాహరణగా చెబుతూ సమాధానం ఇచ్చారు.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
‘‘ అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులు, అత్యధిక కృషి చేసి వ్యక్తులు, ఉదాహరణకు అబ్రహం లింకన్ ను చూడండి, ఎవరైన భారీ ప్రజాధరణ కలిగి ఉంటారో వారినే ఇలాంటి వ్యక్తులు టార్గెట్ చేస్తారు’’ అని ట్రంప్ అన్నారు. తాను దేశం కోసం చాలా పనులు చేశానని, ఈ దేశాన్ని మార్చానని, అయితే ఈ విషయంపై సంతోషంగా లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతారని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ప్రజా జీవితంత ప్రమాదకరమైన జీవితమని, ఇలాంటి ఘటనలు జరిగితే చాలా మంది మానసికంగా కుంగిపోతారు, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాలు:
శనివారం జరిగిన ఘటనకు ముందు జూలై 2024లో పెన్సిల్వేనియాలోని బట్లర్ లో జరిగిన ఒక ప్రచార సభలో ఒక వ్యక్తి పైకప్పు నుంచి ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ట్రంప్ తృటిలో తప్పించుకున్నాడు. బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్‌కు చిన్న గాయమైంది. భద్రతా బలగాలు నిందితుడైన 20 ఏళ్ల థామస్ క్రూక్స్‌ను కాల్చి చంపాయి.
కొన్ని నెలల క్రితం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో ట్రంప్ ను చంపాలనే ఉద్దేశంతో దాక్కుని ఉన్న వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిని చంపాలని చూసినందుకు నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఫిబ్రవరిలో 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే యువకుడు ట్రంప్ ఫ్లోరిడా నివాసం మారా లాగో రిసార్ట్2లో తుపాకీతో ప్రవేశించాడు. సీక్రెట్ ఏజెంట్లు అతడిని కాల్చి చంపారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..