సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారతీయ వివాహిత మహిళా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోవాసిగా గుర్తించారు. వరకట్న వేధింపులతో భర్త చంపేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.
లక్నోకు చెందిన ఐమాన్ ఖాన్. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ముస్లిం ఆచారాల ప్రకారం ఏప్రిల్ 10, 2025న లక్నోలో మొహమ్మద్ అమీర్ ఖాన్‌తో వివాహం అయింది. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తొలుత ఇన్నోవా కారు కావాలని కోరితే.. వెంటనే కియా కారు కొనిచ్చారు. అయితే ఆ కారు అమీర్ పేరు మీద లేకపోవడంతో భార్య మొబైల్ ఫోన్‌ను పగలగొట్టాడు. అంతేకాకుండా వెంటనే సౌదీకి వెళ్లిపోయాడు. జూన్‌లో ఐమాన్ ఖాన్‌ను జెడ్డాకు పిలవడంతో అక్కడకు వెళ్లిపోయింది.
తీరా వెళ్లాక భర్త, సోదరుడు, మరో ఇద్దరు బంధువులు రూ.20 లక్షలు తీసుకురావాలని వేధించడం ప్రారంభించారు. డబ్బు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులు తాళలేక అక్టోబర్ 2025న తిరిగి భారత్‌కు వచ్చేసింది. చేసేదేమీలేక అత్తమామలకు డబ్బు అందిస్తానని ఐమాన్ ఖాన్ తండ్రి హామీ ఇచ్చాడు. ఇక వేధించబోమని హామీ ఇవ్వడంతో తిరిగి అక్టోబర్ 19, 2025న ఐమాన్ ఖాన్ జెడ్డాకు వెళ్లింది. అయినా కూడా వేధింపులు ఆగలేదు. వెళ్లిన దగ్గర నుంచి ఆహారం పెట్టకుండా కడుపు మాడ్చడమే కాకుండా.. వేధింపులు ఎక్కవ కావడంతో తిరిగి భారత్‌కు వచ్చేస్తుండగా పాస్‌పోర్ట్ బలవంతంగా లాక్కుని ఇంటి నుంచి గెంటేశారు.
ఈ క్రమంలో డిసెంబర్ 17, 2025న వాట్సాప్ కాల్ సంభాషణ బట్టి బాధిత తండ్రికి అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని అనుమానాలు రేకెత్తాయి. ఇక డిసెంబర్ 18 నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాకుండా బంద్ అయ్యాయి. దీంతో పొరుగువాడు సాయంతో.. పోలీసులు సమక్షంలో సోదాలు చేయగా ఐమాన్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుమార్తె మరణం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించారు.
సౌదీ నుంచి ఐమాన్ ఖాన్ మృతదేహాన్ని లక్నోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భర్త, అత్తమామలపై లక్నో పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులతో పాటు శారీరిక, మానసిక వేధింపులకు గురి చేశారని కంప్లంట్‌లో పేర్కొన్నారు. పోస్ట్ మార్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐమాన్ ఖాన్ ప్రస్తుతం గర్భవతి అని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా చిన్‌హాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దినేష్ మిశ్రా తెలిపారు. ఈ కేసు విషయంలో విదేశాంగ శాఖ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
