Iskcon: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. అయితే, ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తెలిపింది. రథయాత్రతో ట్రంప్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.