కరోనా కారణంగా చాలా కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అవకాశం ఉన్న అనేక కంపెనీలు ఈ బాట పడుతున్నాయి. కరోనా కేసులు తగ్గినప్పటికీ తీవ్రత పొంచి ఉండటంతో పలు టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసే సౌకర్యం కల్పించింది. ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సామాజిక మాధ్యమం లింక్డిన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నది.
Read: ఆ పాత మథురమైన చిత్రాలు… సుమథుర జ్ఞాపకాలు… ఇకపై భద్రం!
లింక్డిన్‌లో పనిచేసే ఉద్యోగులు ఇంటినుంచి పనిచేసే ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసరం అనుకున్న సిబ్బంది మాత్రం ఆఫీసులకు రావొచ్చని, మిగతా ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయవచ్చని తెలిపింది. ఇంటి నుంచిపనిచేసే ఉద్యోగులు తమ నివాస స్థలాలను మార్చుకుంటే దానికి అనుగుణంగా జీతాల చెల్లింపులు చెల్లిస్తామని సంస్థ తెలియజేసింది. లింక్డిన్‌కు ప్రపంచవ్యాప్తంగా 16 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.