Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తులు జోరు కొనసాగుతోంది. ఏ ఉగ్రవాది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతాడో తెలియడం లేదు. దీంతో పాక్ వ్యాప్తంగా ఉగ్రవాద వర్గాల్లో భయం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మరో ఉగ్రవాది హతమయ్యారు. పాక్ ప్రేరేపిత ‘‘లష్కరే తోయిబా’’కు చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఇస్లామాబాద్‌లోని కుబా మసీదు వద్ద అతను ప్రాణాలు కోల్పో్యాడు.
మసీదుకు వెళ్లే ముందు ఖారీ సయీద్ ఓ రెస్టారెంట్లో భోజంన చేసినట్లు సమాచారం. ప్రార్థనలు చేసేందుకు కుబా మసీదు చేరుకున్న వెంటనే గేటు వద్ద కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. అయితే, అతడి మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. లష్కరే తోయిబాలో ఖారీ సయీద్ కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. జమ్మూ కాశ్మార్లో భద్రతా బలగాల దాడుల్లో హతమైన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక, ఇతర సహాయం అందించే విభాగాన్ని ఇతను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
ఇదిలా ఉంటే, ఈ మరణం నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఓ కీలక ఉగ్రవాది చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత మూడు నాలుగేళ్లలో పాకిస్తాన్లో లష్కరే తోయిబాకు చెందిన పలువురు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారని రిజ్వాన్ హనీఫ్ అనే లష్కర్ ఉగ్రవాది ఓ వీడియోలో పేర్కొన్నారు. పెషావర్, కరాచీ, రావల్పిండి, రావలకోట్, ముజఫరాబాద్ తదితర ప్రాంతాల్లో 30 మందికి పైగా లష్కర్-ఎ-తయిబా సభ్యులు హతమైనట్లు అతడు పేర్కొన్నాడు.2008 ముంబై ఉగ్రవాద దాడులతో పాటు భారత్ వ్యాప్తంగా చాలా ఉగ్రవాదులకు పాల్పడిన లష్కరే తోయిబాపై అంతర్జాతీయ ఆంక్షలు ఉున్నాయి. ఐక్యరాజ్యసమితి 2005లో దీనిపై ఆంక్షలు విధించి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!