బంగారు పతకం అందుకున్న మూషికం మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం పతకం అందుకున్న ఓ మూషిక రాజు కన్నుమూశారు.. అదేంటి.. ఎలుక ఏంటి? బంగారం పతకం అందుకోవడం ఏంటి..? అసలు ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటేనే పట్టి చంపేస్తాం.. బోన్ పెట్టో.. ప్యాడ్ తోనూ వాటిని పట్టుకుని చంపేస్తుంటాం.. ఎందుకంటే.. ఎలుక రాజులు ఇళ్లలో చేసే పనులు అలాంటివి.. కానీ, ప్రత్యేక శిక్షణ పొందిన ఓ ఎలుక.. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.. కాంబోడియాలో మందుపాతరల అన్వేషణలో దిట్టగా పేరొందిన ఆ ఎలుక.. మందుపాతరల బారి నుంచి చాలా మందిని సేవ్ చేసింది.. ఆ ఎలుక సేవలకు ప్రతిష్ఠాత్మక బంగారు పతకాన్ని కూడా అందజేసింది ఓ సంస్థ.. గత ఏడాదే రిటైర్మంట్ కూడా పొందిన ఆ ఎలుక ఇప్పుడు కన్నుమూసింది.
Read Also: బూస్టర్‌డోసు నుంచి రక్షణ ఎంత..?
Also Read
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రికన్ సంతతికి చెందిన ‘మగావా’ అనే ఎలుక మృతిచెందింది.. మందుపాతరలను గుర్తించడం, వాటిని వెలికితీయడంలో.. ఎంతో కీలకంగా పనిచేసింది.. పేలుడుకు అవకాశం లేకుండా ముందుగానే ఎన్నో మందుపాతరలను గుర్తించింది.. బెల్జియం కేంద్రంగా పనిచేసే ‘అపొపో’ అనే స్వచ్ఛంద సంస్థ.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. అపొపో.. మందుపాతరల వంటివి వాసన ద్వారా కనుగొనేలా ఎలుకలు, కుక్కలకు శిక్షణ ఇచ్చే సంస్థ.. 2013లో టాంజానియాలో పుట్టిన ‘మగావా’ను శిక్షణ తర్వాత అనంతరం 2016లో కాంబోడియాకు పంపారు. అప్పటి నుంచి వందకు పైగా మందుపాతరలను గుర్తించింది మగావా.. కాగా, ఈ దేశంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు సాగిన అంతర్యుద్ధం 1998లో ముగిసింది.. యుద్ధ సమయంలో భూమి లోపల పాతిపెట్టిన మందుపాతరలు పెద్ద సవాల్‌గా మారాయి.. అవి పేలి ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.. కానీ, ఐదేళ్ల పాటు సేవలు అందించిన మగావా.. ఎన్నో మందుపాతరలను, బాంబులను గుర్తించి.. వాటిని నిర్వీర్యం చేయడంలో అద్భుతమైన సేవలను అందించింది.. ఇప్పటికే ఈ ఎలుకకు రిటైర్మెంట్ కూడా ఇచ్చారు.. మరోవైపు.. మగావా అందించిన సేవలకు గుర్తించిన బ్రిటన్‌కు చెందిన ‘పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ అనిమల్స్’ అనే వెటర్నరీ ఛారిటీ సంస్థ… 2020లో మగావాకు బంగారు పతకాన్ని కూడా అందజేసింది.. అల్ప జీవే అనుకున్నా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ మూషిక రాజు.. చివరకు ప్రాణాలు వదిలాడు.
- Tags
తాజావార్తలు
-
Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!