Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav sooryavanshi: యంగ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వైభవ్ పేరు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్ లోనూ మారుమోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన బుడ్డోడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పాకిస్థాన్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి గూగుల్ ట్రెండ్స్ తాజా లెక్కలే నిదర్శనం.
గత మూడు నెలల కాలంలో పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెట్ అంశాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కువగా నిలిచింది. గూలె లో పాకిస్థాన్ ఎక్కువగా.. “Vaibhav Suryavanshi”, “Vaibhav Suryavanshi age”, “Vaibhav Suryavanshi stats”, “Vaibhav Suryavanshi today match”, “Vaibhav Suryavanshi IPL price 2026”, “Vaibhav Suryavanshi height” వంటి కీవర్డ్స్ తో భారీగా సెర్చ్ చేశారు. వీటిలో కొన్ని ‘బ్రేకౌట్’ కేటగిరీలో ఉండటం చూస్తే వైభవ్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.
Also Read

వైభవ్‌కు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం అతని ధనాధన్ బ్యాటింగ్. చిన్న వయసులోనే భారీ షాట్లు ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకువస్తాడు. 2 రోజుల క్రితం మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించడంతో అతనిపై చర్చ మరింత పెరిగింది. పాకిస్థాన్‌లో అభిమానులు కేవలం అతని పేరు మాత్రమే కాకుండా.. వయసు, ఐపీఎల్ ధర, గణాంకాలు, మ్యాచ్ ప్రదర్శనల గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి అక్కడి క్రికెట్ అభిమానులు కూడా వైభవ్ కెరీర్‌ను నిశితంగా గమనిస్తున్నారు.

తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?