North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు. గత బుధ, గురువారాల్లో ప్యాంగ్యాంగ్ నగర గగనతలంలోకి ప్రచార కర పత్రాలను మోసుకెళ్లే డ్రోన్‌లను దక్షిణ కొరియా పంపిందని నార్త్ కొరియా వెల్లడించింది.
Read Also: Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
ఇక, ఈ ప్రకటనను దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ తీవ్రంగా ఖండించారు. ఉత్తర కొరియా ఆరోపణలు నిజమో కాదో నిర్ధారించలేమని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. దీంతో కిమ్ సోదరి యో జోంగ్ మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆరోపణలను ధృవీకరించడానికి దక్షిణ కొరియా నిరాకరించడం.. డ్రోన్‌లను మీ మిలిటరీ గ్యాంగ్‌స్టర్లు పంపారని స్పష్టం చేసింది. మరోసారి మీ డ్రోన్లను మేం కనుక్కున్న క్షణం భయంకరమైన విపత్తుకు దారి తీస్తుంది అని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
Read Also: SpaceX: అద్భుతం.. ‘అంతరిక్షం’ నుంచి భూమిపై సురక్షితంగా దిగిన రాకెట్
అలాగే, సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య ఉన్న రహదారులను పేల్చి వేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పశ్చిమ మరియు తూర్పు తీరాలకు సమీపంలో ఉన్న సరిహద్దులో రోడ్లను పేల్చి వేసేందుకు నార్త్ కొరియా సైనికులు సన్నాహాలు చేస్తున్నారని దక్షిణ కొరియా సైనిక ప్రతినిధి ఆరోపించారు. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియాకు అనుసంధానించబడిన రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా కట్ చేసి సరిహద్దులో ఉన్న ప్రాంతాలను పటిష్టం చేస్తామని ప్యాంగ్యాంగ్ రాష్ట్ర మీడియా KCNAలో ఓ కథనం ప్రచురమైంది.