Kim Jong Un Declares Shining Victory Over Covid: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశంలోని కోవిడ్ పరిస్థితులపై అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. దాదాపుగా గత రెండు వారాల నుంచి కొత్తగా వైరస్ కేసులు లేవని.. అధికారులు ప్రకటించిన తరువాత దీన్ని గొప్ప విజయంగా అభివర్ణించారు కిమ్. ప్రాణాంతక మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విజయం సాధించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారని అధికారిక వార్త సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. గత మేలో నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ తో పాటు దేశంలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగాయి.
అయితే నార్త్ కొరియా మాత్రం కరోనా కేసులు పిలవకుండా కేవలం విష జ్వరాలుగానే ట్రీట్ చేసింది. కనీసం కరోనా పేరు ఎత్తడానికి కూడా నార్త్ కొరియా ఇష్టపడలేదు. కరోనా పరీక్ష సామర్థ్యం లేకపోవడంతోనే వీటన్నింటిని జ్వరాలుగా చెబుతోంది నార్త్ కొరియా. అయితే కరోనా విజృంభన వల్ల ఆ దేశంలో చాలా మంది చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అక్కడి కిమ్ సర్కార్ మాత్రం అలాంటిదేం లేదని చెబుతోంది. ఉత్తర్ కొరియా లెక్కల ప్రకారం దేశంలో ఏప్రిల్ నుంచి దాదాపుగా 4.8 మిలియన్లు కరోనా బారినపడ్డారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం మరణాల రేటు 0.002 శాతంగా.. కేవలం 74 మంది మాత్రమే చనిపోయారని అక్కడి ప్రభుత్వం చెప్పుకొస్తోంది.
Read Also: Thursday 2022 Special Sri Shirdi Sai Chalisa Live: ఈ రోజు రీ సాయి చాలీసా వింటే సిరిసంపదలు మీ వెంటే
తాజాగా కిమ్, ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలతో సమావేశం అయి దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు. మన ప్రజలు సాధించిన విజయం మన దేశ గొప్పతనం అని.. గర్వించదగిన చారిత్రాత్మక సంఘటన అని కిమ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సమావేశానికి హాజరైన అధికారులు, సైంటిస్టులు యథావిధిగానే అంతా కిమ్ నాయకత్వాన్ని పొగడటం.. ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశం అనంతర కిమ్, అధికారులతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన వైద్య వ్యవస్థ, ఆస్పత్రులను కలిగి ఉంది. దక్షిణ కొరియా లెక్కల ప్రకారం ఉత్తర కొరియాలో మరణాల రేటు 0.12 శాతంగా ఉంది. ఉత్తర్ కొరియా ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు సంబంధించి కనీసం ఔషధాలు కూడా లేని పరిస్థితి.