Iran: హిజ్బుల్లా కమాండర్లని చంపితే ఓటమి కాదు..ఇజ్రాయిల్‌పై ఇరాన్ వ్యాఖ్యలు…
- ఒక్క కమాండర్‌ని చంపితే ఓటమి కాదు..
- ఇజ్రాయిల్-హిజ్బుల్లా దాడులపై స్పందించిన ఇరాన్..
- శత్రువులను చంపలేక ప్రజల్ని చంపుతుందన్న సుప్రీం లీడర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇజ్రాయిల్, లెబనాన్‌లో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. వరసగా దాడులు నిర్వహిస్తోంది. గత వారం పేజర్ల దాడి జరిగిన తర్వాత లెబనాన్‌పై దాడుల్ని విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. హిజ్బుల్లా కమాండర్లను హతమార్చడం హిజ్బుల్లాని మోకాళ్లపైకి తీసుకురాదని అన్నారు. హిజ్బుల్లా సంస్థాగత బలం, మానవ వనరులు చాలా బలంగా ఉన్నాయని, ఒక సీనియర్ కమాండర్‌ని చంపడం వల్ల అది నష్టపోదని ఖమేనీ చెప్పారు.
Read Also: Success Tips: ఈ అలవాట్లు ఉంటే జీవితంలో సక్సెస్ అవ్వలేరు..
Also Read
లెబనాన్ ఆరోగ్య మంత్రి ప్రకారం.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సోమవారం నుంచి జరుపుతున్న దాడుల్లో 569 మంది మరణించారు. దాదాపుగా రెండు దశాబ్ధాల తర్వాత లెబనాన్ ఇజ్రాయిల్ నుంచి భీకరదాడిని ఎదుర్కొంది. పాలస్తీనా, లెబాన్ ప్రతిఘటన అంతిమ విజయం సాధింస్తుందని ఖమేనీ అన్నారు. ఇజ్రాయిల్ తన శత్రువుల్ని ఓడించలేక పౌరులను చంపుతోందని ఆరోపించారు.
గతేడాది అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. అయితే, హమాస్‌కి మద్దతు నిలుస్తామని పలు సందర్భాల్లో హిజ్బుల్లా ప్రకటించింది. లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయిల్ ప్రాంతం నుంచి దాడులు చేస్తోంది. హమాస్ యుద్దం ప్రారంభమైన ఏడాది తర్వాత ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఆ మిలిటెంట్ సంస్థలోని కీలక కమాండర్లను హతం చేసినట్లు చెప్పింది. గతంలో ఫువాద్ షుక్ర్ని, ఇటీవల ఇబ్రహీం అఖిల్‌ని హతం చేసినట్లు ప్రకటించింది. ఆ సంస్థ టాప్ -9 లీడర్లలో ఆరుగురిని ఎలిమినేట్ చేసినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!