అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడిని ఎత్తి చూపుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. పూర్తిగా రంగంలోకి దిగితే టెహ్రాన్ సామర్థ్యమేంటో రూచి చూపిస్తామని అమెరికా, దాని మిత్ర దేశాలను ఖమేనీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ అణు కార్యకలాపాలపై టెహ్రాన్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అణు కార్యకలాపాలను నిలిపివేయాలని ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర టెలివిజన్‌లో ఖమేనీ మాట్లాడుతూ.. అమెరికా, దాని మిత్ర దేశాల శక్తిని ఎదుర్కొనే శక్తి టెహ్రాన్‌కు ఉందన్న సంగతి మరిచిపోవద్దని సూచించారు. టెహ్రాన్‌పై వస్తున్న ఒత్తిడిలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Earthquake: అలస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జూన్ 13న ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అనంతరం అమెరికా కూడా చేతులు కలిపి ఇరాన్ అణు శక్తి సామర్థ్యాలను ధ్వంసం చేశాయి. ఫోర్డో అణు కేంద్రాన్ని నాశనం చేసినట్లు సమాచారం. తిరిగి కోలుకునేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. ఈ మేరకు అమెరికా అంచనా వేస్తోంది. అయితే ఇరాన్ క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలకు మాత్రం ఏ ఢోకా లేదని సమాచారం. ఈ సామర్థ్యం బాగానే ఉన్నట్లుగా అమెరికా అంచనా వేస్తోంది. అయితే అమెరికాతో ఇరాన్ చర్చలకు అంగీకరించకపోతే పాశ్చాత్య దేశాలు.. ‘‘స్నాప్‌బ్యాక్’’ ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
