NTV Telugu Site icon

SriLanka Crisis: కిలో క్యారెట్‌ రూ.490, టొమాటో రూ.150..!

Tomato, Carrot

Tomato, Carrot

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితిలు రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాయి.. నిత్యావసరాల నుంచి ఏ వస్తువుకు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది.. ఆ దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో అక్రమంగా అన్నింటి ధరలు పైపైకి కదులుతున్నాయి.. ఇక, కూరగాయల ధరలు కూబా లంకలో భగ్గుమంటున్నాయి.. కిలో క్యారెట్‌ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది.. బంగాళాదుంపలు రెండు వందలు దాటేశాయి.. గ్రామ్‌ వెల్లుల్లి రూ.150 దాటేసింది శ్రీలంక ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు శ్రీలంక రూపాయల్లో 150కి చేరింది.. కిలో క్యారెట్ రూ.490గా ఉండగా.. కిలో ఉల్లిని 200కు విక్రయిస్తున్నారు.. కిలో బంగాళదుంపలు రూ.220కి ఎగిసింది.. గ్రామ్ వెల్లుల్లిని శ్రీలంకలో ఏకంగా రూ.160కి విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

Read Also: Pawan Kalyan : జనసేన పోయిన చోటే వెతుక్కుంటుందా..? మరోసారి బరిలోకి దిగుతారా..? l

శ్రీలంకలో ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 500ను దాటేసింది.. అది కూడా వారం రోజులు క్యూలో ఉంటే గాని పెట్రో దొరకని పరిస్థతి.. అప్పటి వరకు క్యూలో ఉన్నా.. దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు.. ఇక, బ్లాక్ లో రెండువేలు దాటేసింది లీటర్ పెట్రోలు ధర.. దీంతో, రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి.. ఇక, కూరగాయల ఉత్పత్తులను తీసుకురావడం మరియు వాటిని సురక్షితంగా ఉంచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని కూరగాయల విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వీటి మూలంగా కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయని చెబుతున్నారు.. మొత్తంగా శ్రీలంకలో మునుపెన్నడూ లేని విధంగా కిరాణా ధరలు పెరగడమే కాదు, దేశంలో ఇంధన కొరత కూడా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేయబడింది. 1990 అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది.

1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పుడే శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ మరియు ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది… ఇదిలా ఉంటే.. అన్ని పార్టీలు కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తను రాజీనామా చేస్తానని ప్రధానికి తెలియజేశారు. కాగా, నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేయడంతో ఆయన గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఆందోళనకారులు విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టారు. రాజపక్సే తన నివాసం నుండి పారిపోయిన తర్వాత లక్షల రూపాయల నగదును వదిలేసి వెళ్లారని.. ఆ మొత్తాన్ని కోర్టుకు అందజేస్తామని పోలీసులు తెలిపారు.