బతుకుదెరువు కోసం దుబాయ్ బాట పట్టాడు.. 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పనిచేస్తున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది.. ఆన్‌లైన్ లాటరీలో 10 కోట్ల రూపాయల బంపర్ బహుమతిని తగిలింది.. మొత్తానికి కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం రాత్రికి రాత్రే ధనవంతుడిని చేసింది.. కేరళ రాజధాని తిరువనంతపురంకు చెందిన షానవాజ్.. బతుకుదెరువు కోసం.. గత 15 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఆన్‌లైన్ లాటరీలో పాల్గొంటూ వస్తున్నాడు.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఆన్‌లైన్ లాటరీ డ్రాలో మొదటి బహుమతి 50 లక్షల దిర్హామ్‌లు అంటే భారతీయ కరెన్సీలో రూ.10 కోట్లు గెలుచుకున్నాడు.
Read Also: Revanth Reddy: ‘మన మునుగోడు – మన కాంగ్రెస్’ పోస్టర్ ఆవిష్కరణ.. రేపు మునుగోడుకు రేవంత్
షానవాజ్‌ను 7, 9, 17, 19, 21 నంబర్ సిరీస్‌లు లాటరీ విజేతగా నిలిపాయి. షానవాజ్ గత 15 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నారు. అతను 18 నెలల నుండి ఆన్‌లైన్ డ్రాలో పాల్గొంటున్నాడు. కేరళకు చెందిన షానవాజ్ మరియు అతని కుటుంబం 10 కోట్ల మొత్తాన్ని గెలుచుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.. ఈ భారీ విజయంపై దుబాయ్‌లో ఆన్‌లైన్ లాటరీలో మొదటి విజేత స్పందిస్తూ, తాను చాలా అప్పులు చేశానని, దానిని తీర్చడంలో మొదటి వ్యక్తి అవుతానని చెప్పాడు. రుణం ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని దుబాయ్‌లో వ్యాపార పెట్టుబడికి వినియోగిస్తానని షానవాజ్ చెప్పాడు. దుబాయ్ ఆన్‌లైన్ లాటరీలో భారతీయుడితో పాటు విదేశీయుడైన నెల్సన్ కూడా రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంత భారీ మొత్తం గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.