UK Warns: గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు
- గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాకే మద్దతిస్తాం
- బ్రిటన్ బెదిరింపులపై మండిపడ్డ నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా చేశారు. గాజాలో కాల్పుల విరమణ విఫలమైతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తుందని ఇజ్రాయెల్‌కు స్టార్మర్ హెచ్చరించారు. తక్షణమే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. గాజాలో మానవతా పరిస్థితులు మెరుగుపడాలని.. ఐక్యరాజ్యసమితి సహాయం అందించడానికి అనుమతించాలని కోరారు. లేదంటే సెప్టెంబర్‌లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: దగ్గర పడ్డ ట్రంప్ డెడ్‌లైన్.. భారత్‌కు తాజా హెచ్చరిక ఇదే
Also Read
గాజాలో దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించాల్సిందేనని స్టార్మర్ తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ శాంతికి కట్టుబడి ఉండాలన్నారు. యూఎన్ సహాయ సరఫరాకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఆకలి బాధతో శిశువులు అలమటిస్తున్నారని.. ఇప్పటికైనా బాధలు అంతం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Lokesh ; అజిత్‌తో సినిమా ప్లాన్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బ్రిటన్ ప్రధాని స్టార్మర్ బెదిరింపులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్ట్రాంగ్‌గా స్పందించారు. అలాంటి చర్యకు దిగితే ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. జిహాదిస్ట్ ఉగ్రవాదల పట్ల బుజ్జగింపు ఎప్పటికైనా విఫలమవుతుందన్నారు. స్టార్మర్.. క్రూరమైన ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారని.. బాధితులను శిక్షిస్తున్నారని మండిపడ్డారు. స్టార్మర్ ప్రయత్నాలు విఫలం అవుతాయని నెతాన్యాహు పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!