Pakistan: అంధకారంలో కరాచీ నగరం.. 40 శాతం నగరానికి పవర్ కట్..
Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది. కరాచీ నగరంలో 40 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైటెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా అనేక గ్రిడ్ స్టేషన్లు విఫలమయ్యాయని అక్కడి మీడియా వెల్లడించింది.
Read Also: H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్‌తో మరొకరు మృతి.. 7కు చేరిన మరణాల సంఖ్య
Also Read
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
కరాచీలోని నుమాయిష్ నుమాయిష్ చౌరంగి, సద్దర్, లైన్స్ ఏరియా, పంజాబ్ కాలనీ, గులిస్తాన్-ఎ-జౌహర్ మరియు కోరంగి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్న కే ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మంగళవారం ఉదయం 7.34 గంటలకు నేషనల్ గ్రిడ్ ఫ్రీకెన్సీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. నేషనల్ గ్రిడ్ ప్రీక్వెన్సీలో హెచ్చతగ్గుల మూలంగా పాకిస్తాన్ లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. జనవరి నెలలో కరాచీ నగరం ఇలాగే అంధకారంలో చిక్కుకుంది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ తో సహా అన్ని ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!