Pakistan: కరాచీ దాడికి పాల్పడింది బీఎల్‌ఏ.. విదేశీ గూఢచార సంస్థతో సంబంధం..
- పాక్-చైనా బంధాన్ని దెబ్బతీయడానికే కరాచీ ఆత్మాహుతి దాడి..
- బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడి చేసినట్లు ప్రాథమిక రిపోర్ట్..
- ఇద్దరు చైనీయుల మృతి..17 మందికి గాయాలు..
- విదేశీ గూఢచార సంస్థ ప్లాన్‌లోనే బీఎల్ఏ దాడి..
- పాకిస్తాన్ మీడియాలో రిపోర్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇటీవల పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో చైనీయులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపుల పేలుడు కారణంగా ఇద్దరు చైనా పౌరులు మరణించగా, 17 మంది గాయపడ్డారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనా-పాకిస్తాన్ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతోనే దాడి జరిగినట్లు అక్కడి మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే పేలుడుపై పాక్ ప్రభుత్వం తయారు చేసిన ప్రాథమిక రిపోర్టులో విదేశానికి చెందిన గూఢచార సంస్థ సాయంతో ఈ దాడి జరిగిందని పాక్ మీడియా పేర్కొంది. పాకిస్తాన్-చైనా సంబంధాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే చైనా ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని ఉగ్రవాద నిరోధక విభాగం (సిటిడి) ఉగ్రవాద నిరోధక కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
Also Read
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
Read Also: Kakinada: చందాకి వచ్చి మహిళపై మత్తు మందు చల్లి సొమ్ము చోరీ
ఆదివారం, చైనా కార్మికులు కాన్వాయ్ లక్ష్యంగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన దాడిలో ఇద్దరు చైనీయులు మరణించారు. పేలుడు పదార్థాలను పేల్చే ముందు గుర్తుతెలియని ఉగ్రవాది తన వాహనాన్ని చైనా జాతీయులు కాన్వాయ్‌కి దగ్గరగా నిలిచి ఉంచినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఇద్దరు చైనీయులు కరాచీ శివారులోని పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలో పనిచేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా వారి కాన్వాయ్‌పై దాడి జరిగింది.
దాడిలో 70-80 కిలోల పేలుడు పదార్థాలను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. కరాచీలో జరిగిన ఘోరమైన ఆత్మాహుతి బాంబు దాడి తరువాత పాకిస్తాన్‌కు ఇంటర్-ఏజెన్సీ వర్కింగ్ గ్రూప్‌ను పంపినట్లు చైనా తెలిపింది. 60 బిలియన్ డాలర్ల విలువైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ఆధ్వర్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతున్న అనేక ప్రాజెక్టుల్లో చైనా సిబ్బంది పనిచేస్తోంది.
ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా బలూచిస్తాన్ ప్రాంతంలో గ్వాదర్ పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఈ పోర్టుని చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సుని కలిపేలా రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే, బలూచ్ ప్రజలు మాత్రం తమ వనరులను చైనా కొల్లగొడుతోందని భావిస్తున్నారు. దీంతోనే పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా చైనా జాతీయులు లక్ష్యంగా బీఎల్ఏ దాడులకు పాల్పడుతోంది. పాకిస్తాన్ నుంచి ఈ ప్రాంతాన్ని విముక్తం చేయాలని ఈ గ్రూపు అనేక ఏళ్లుగా పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!