Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Justin Trudeau Responds To Donald Trumps Canada 51st State

Justin Trudeau: ‘‘మేం అమెరికన్లం కాము’’.. ట్రంప్ ‘‘కెనడా 51వ రాష్ట్రం’’ కామెంట్స్‌పై ట్రూడో..

Published Date :January 10, 2025 , 2:55 pm
By BV Reddy
  • ట్రంప్ ‘‘కెనడా 51వ రాష్ట్రం’’ కామెంట్స్‌‌పై స్పందించిన ట్రూడో..
  • అది ఎప్పటికీ జరగదు, మేం అమెరికన్లం కాము..
  • సుంకాలు పెంచితే అమెరికన్లకే నష్టం..
  • ఇటీవల కెనడా అమెరికాలో కలవాలని కోరిన ట్రంప్..
Justin Trudeau:  ‘‘మేం అమెరికన్లం కాము’’.. ట్రంప్ ‘‘కెనడా 51వ రాష్ట్రం’’ కామెంట్స్‌పై ట్రూడో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Justin Trudeau: అమెరికా, కెనడా మధ్య ట్రంప్ వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కెనడా అమెరికాలో ‘‘51వ రాష్ట్రం’’గా మారాలని ఆయన కోరారు. ఇలా చేస్తే, అధిక సుంకాలు, భద్రత ఇబ్బందులు ఉండవని, చైనా-రష్యాల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్‌ని కలిసిన సందర్భంలో కూడా ట్రంప్ మాట్లాడుతూ.. కెనడా అమెరికాలో రాష్ట్రంగా మారాలని, గవర్నర్‌గా జస్టిన్ ట్రూడో ఉండాలని వ్యాఖ్యానించాడు. మరోవైపు కెనడా, అమెరికా మధ్య వాణిజ్య లోటు ఉందని, దీంతో కెనడా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, ట్రంప్ వ్యాఖ్యలపై జస్టిన్ ట్రూడో స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు దృష్టి మరల్చే వ్యూహంగా అభివర్ణించారు. ‘‘అది ఎప్పటిక జరగదు. కెనడా ప్రజలు కెనడియన్లుగా ఉండటం పట్ల చాలా గర్వంగా ఉన్నారు. మనల్ని మనం సులభంగా నిర్వచించుకునే మార్గల్లో ఒకటి. మనం అమెరికన్లం కాము’’ అని సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నారు.

Read Also: Steve Smith: ఒక్క పరుగుతో 10వేల మైలురాయి మిస్‌.. స్టీవ్ స్మిత్ ఏమన్నాడంటే?

కెనడా సరిహద్దు భద్రతను పెంచకపోతే అన్ని కెనడియన్ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ ఇటీవల సూచించారు, ఈ చర్య రెండు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని ట్రూడో హెచ్చరించారు. అటువంటి సుంకాలను అమలు చేస్తే పెరిగిన ధరల భారాన్ని అమెరికా వినియోగదారులు భరించాల్సి ఉంటుందని ట్రూడో అన్నారు. “ఈ సుంకాలను పెంచడంపై ఆయన ముందుకు వెళితే, చమురు, గ్యాస్, విద్యుత్, ఉక్కు, అల్యూమినియం, కలప, కాంక్రీటు ఇలా అమెరికన్ వినియోగదారులు కెనడా నుండి కొనుగోలు చేసే ప్రతిదీ అకస్మాత్తుగా చాలా ఖరీదైనదిగా మారబోతోంది” అని హెచ్చరించారు.

2018 వాణిజ్య వివాదంలో కెనడా గతంలో కౌంటర్ టారిఫ్‌ను ఉపయోగించిందని హీన్జ్ కెచప్, ప్లేయింగ్ కార్డ్‌లు, బోర్బన్ మరియు హార్లే-డేవిడ్సన్ మోటార్‌సైకిళ్ల వంటి అమెరికన్ వస్తువులను లక్ష్యంగా చేసుకున్నారని ట్రూడో గుర్తు చేశారు. కానీ మేము అలా చేయాలనుకోవడం లేదని, ఎందుకంటే కెనడియన్లకు ధరలను పెంచడం ఇష్టం లేదని, మా దగ్గరి వాణిజ్య భాగస్వామికి హాని కలిగిస్తుందని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada
  • Canada 51st State
  • Donald Trump
  • Justin Trudeau
  • US news

తాజావార్తలు

  • Richest People: కుబేరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్.. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్.. ఇండియా నుంచి ఎవరంటే..

  • Best Air Coolers: AC అవసరం లేదు.. రూ. 6 వేల లోపు బడ్జెట్‌లోనే బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!

  • Puri and Paratha: పూరీ ఎందుకు ఉబ్బుతుంది..? పరాఠా ఎందుకు ఉబ్బదు..? ఆసక్తికర రహస్యం..

  • Telegram: యూజర్లకు అలర్ట్! టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే?

  • ACB Raids: అవినీతి వలలో చిక్కిన తహసీల్దార్.. సోదాల్లో కళ్లు చెదిరే డబ్బులు..

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions