Viral Viedo: జూలో వన్యప్రాణులు, క్రూర మృగాలను చూసి పర్యటకులు ఆనందిస్తుంటారు. కానీ, అవే నేరుగా ఎదురుపడితే.. భయంతో వణికిపోతారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటారు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారింది. వన్యప్రాణులను చూసేందుకు నేరుగా జంగిల్‌కే వెళుతున్నారు. దగ్గరి నుంచి సింహం, పులి వంటి క్రూర మృగాలను చూసి థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలో జంగిల్ సఫారికి వెళ్లిన కొందరికి ఊహించని సంఘటన ఎదురైంది.
Also Read: Manchu Lakshmi: ముంబైకి మకాం.. ఎందుకో చెప్పిన మంచు లక్ష్మి
అడవిలో పర్యటిస్తున్న వారి కారులోకి సింహం ఎక్కిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో కొందరు ఫారిన్ టూరిస్ట్‌లు జంగిల్ సఫారికి వెళ్లారు. అడవిలో వెళుతున్న వారికి ఆడ సింహం ఎదురైంది. దానికి చూసి థ్రిల్ అయిన వారికి ఆ సింహం షాకిచ్చింది. అలా పక్క నుంచి వెళుతున్న ఆ సింహం అనుకొకుండా వారి కారు ఎక్కింది. ఇది తలుచుకుంటూనే టూరిస్ట్‌ల పరిస్థితి ఎంటా అనిపిస్తోంది కదా!. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కారెక్కిన ఆ సింహం వారిపై దాడి చేయకపోగా.. ప్రేమ కురిపించింది. కారులోకి ఎక్కిన సింహం వారిని ఎలాంటి హాని చేయకుండ దగ్గరికి వెళ్లి కౌగిలించింది.
Also Read: 3 Trains on One Track: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు
దీంతో భయంతో వణికిపోయిన వారు సింహం తీరు చూసి రిలాక్స్ అయ్యారు. వారు కూడా సింహన్ని దగ్గరకు తీసుకుని పాంపర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరిని సర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేస్తూ.. ‘దానికి ప్రేమ కావాలి’ అంటూ క్యాప్షన్. నెటిజన్లు కూడా సింహం తీరు చూసి షాక్ అవుతున్నారు. టూరిస్ట్‌లను ఉద్దేశిస్తూ అదృష్టవంతులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సింహం దాడి చేయకపోగా ఇలా ప్రేమ కురిపించడం వింతగా ఉందంటున్నారు.
he just wants some love ❤️ pic.twitter.com/zqZ8sB4BC3
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 22, 2023