Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- పాక్ బహవల్పూర్లో జైషే మహ్మద్ స్థావరం పునర్నిర్మాణం..
- ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న మర్కజ్ సుభానల్లా ఉగ్ర స్థావరం..
- స్వయంగా పాక్ ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాడులు చేసింది. ఈ దాడుల్లో పీఓకే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. ఇందులో ముఖ్యంగా పీఓకేలోని మురిద్కే ఉన్న లష్కరే తోయిబా కార్యాలయం, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయాలను భారత్ ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM) మార్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం చేయడం ఆపరేషన్ సిందూర్‌లోనే హైలెట్‌గా నిలిచింది. భారత్ 2025 మే 7న చేసిన దాడిలో జైష్ చీఫ్ మసూద్ అజార్ బంధువులు కూడా మరణించారు.
ఇదిలా ఉంటే దాడులు జరిగిన 15 నెలల తర్వాత జైష్ మళ్లీ తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంది. గతేడాది మేలో భారత దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ కాంపౌండ్‌కు కొత్త మార్బుల్, పెయింట్, ప్లాస్టర్ వేశారు. దెబ్బతిన్న గోపురాలను కూడా తిరిగి నిర్మించారు. ప్రధాన హాల్లోని దాడుల ఆనవాళ్లను తొలగించి భవనాన్ని పునరుద్ధరించారు.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
జైషే కార్యాలయం నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా 25 కోట్ల పాక్ రూపాయాలను అందించినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 11 కోట్ల రూపాయల్ని ప్రధాన హాల్ పునర్నిర్మాణానికి ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదే కాకుండా ప్రధాన కాంప్లెక్స్‌ను ఆనుకుని ఉన్న మద్రసా అల్ సబీర్, జైషే కమాండర్ల నివాస ప్రాంతాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక్కడ కొత్త నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
మార్కజ్ సుభాన్ అల్లా అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 18 ఎకరాల్లో విస్తరించిన ఈ కాంప్లెక్స్‌ను ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మసీదుతో పాటు జైష్ కార్యకలాపాలకు సంబంధించిన పలు సౌకర్యాలు ఉన్నాయి. నిజానికి పాక్ ప్రభుత్వం 2002లో జైషే మహ్మద్‌ను నిషేధించినప్పటికీ, ఆ సంస్థ దేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడులను జైషే మహ్మద్ నిర్వహించింది.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!