లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి తీవ్రతరం చేసింది. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీరుట్ దక్షిణ ప్రాంతాన్ని ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఇప్పటికే సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్ నిఘా అధికారులతో సహా 52 మంది చనిపోయారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కూడా ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతమైన దహియేపై దాడి చేసింది. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓ వైపు ఇరాన్‌తో.. ఇంకోవైపు లెబనాన్‌తో ఇజ్రాయెల్ ఏకధాటిగా దాడి చేస్తోంది.
గాజాపై యుద్ధం జరుగుతున్న సమయంలో లెబనాన్ జోక్యం చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ దాడులతో వణికిపోయింది. అనంతరం నవంబర్, 2024న కాల్పుల విరమణ జరిగింది. అప్పటినుంచి లెబనాన్ సైలెంట్‌గా ఉంది. అయితే తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించింది. ఆనాటి నుంచి ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇక ప్రతీకారంగా ఇప్పుడు బీరూట్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.
