Israel : ఇరాన్ – అమెరికా ఒప్పందంలో ఇజ్రాయెల్ ‘నిప్పులు’.. గంటల వ్యవధిలోనే లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల మోత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel : అంతర్జాతీయంగా దౌత్యపరమైన చర్చలు ఫలించి, ఇరాన్ – అమెరికా మధ్య కీలక ఒప్పందం ఖరారై 24 గంటలు కూడా గడవకముందే ప్రాంతీయ ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. దక్షిణ లెబనాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యం అక్కడ భారీస్థాయిలో వైమానిక, ఫిరంగి దాడులకు పాల్పడినట్లు లెబనాన్ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్ఐబి’ (IRIB) వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని కీలక ప్రాంతాలైన జౌతార్, మార్కబా, ఖియామ్ నగరాలపై ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు జరిపినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడంతో పాటు, సరిహద్దు వెంబడి ఫిరంగి దాడులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడటంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, కాల్పుల విరమణను పొడిగించడానికి ఒకవైపు అంతర్జాతీయంగా ముమ్మర దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులకు తెగబడటం గమనార్హం. అయితే సరిహద్దు వెంబడి జరిగిన తాజా దాడుల్లో జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. స్థానిక అధికారులు, లెబనీస్ మీడియా ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రాంతీయ శాంతిని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తాజా దాడులు గట్టి విఘాతంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
- Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!