Israel: ఇజ్రాయిల్ దాడిలో హమాస్ డిప్యూటీ చీఫ్ హతం.. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్ కదులుతోంది. తాజాగా హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్-అరౌరీని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చంపేసింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉన్న అల్-అరౌరీపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు ఈ దాడిని లెబనాన్ ప్రధాని ఖండించారు. మరోవైపు ఇతని మరణానికి హమాస్‌తో పాటు హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ ప్రతినిధి డేనియల్ హగారి ఈ దాడిపై నేరుగా వ్యాఖ్యానించలేదు. అయితే, ఇజ్రాయిల్ సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉందని అన్నారు. తొలిసారిగా ఇజ్రాయిల్ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో దాడుల తర్వాత లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడి చేసింది. ఈ దాడి ఆ ప్రాంతంలో సంక్షోభాన్ని మరింత పెంచడమే కాకుండా, యుద్ధం విస్తరించేందుకు అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు భయపడుతున్నాయి.
Also Read
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
ఇదిలా ఉంటే అరూరి మరణం తమ ఓటమికి దారి తీయదని హమాస్ పేర్కొంది. దీనికి తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని ఇజ్రాయిల్‌కి హెచ్చరికలు జారీ చేసింది. లెబనీస్ ప్రధాన మంత్రి నజీబ్ మికాటి ఈ హత్యను ఖండించారు. లెబనాన్‌ని యుద్ధంలోకి లాగడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఇజ్రాయిల్‌పై ఆరోపణలు గుప్పించారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ మాట్లాడుతూ.. మన ప్రజల, దేశం కోసం నాయకులు అమరులైనప్పటికీ ఉద్యమం ఎప్పటికీ ఆగిపోదని అన్నారు.
అక్టోబర్ 7 నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1200 మందిని హతమార్చారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్ నేతల్ని, వారి స్థావరాలను నేటమట్టం చేస్తుంది. హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధం ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్ దాడిలో ఇప్పటి వరకు 22,185 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!