Israel Prime minister: భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన వాయిదా.. కారణం ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్నెట్ ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. తమ ప్రధాని భారత్‌లో పర్యటించే కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు
కాగా ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తొలిసారిగా భారత్ రానున్నారు. ఇజ్రాయెల్, భారత్ దేశాల మధ్య మైత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌ను మోదీ ప్రత్యేకంగా భారత్‌కు ఆహ్వానించారు. వ్యవసాయం, ఇరిగేషన్, వాణిజ్యం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!