ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు ఇలా నడుస్తుండగానే రెండు రోజుల గ్యాప్‌లో వెస్ట్ బ్యాంక్‌లోని మాలే అడుమిమ్ సెటిల్‌మెంట్ ప్రాంతాన్ని నెతన్యాహు సందర్శించారు. ఇకపై ఈ భూభాగం తమదేనని ప్రకటించారు. ఇక్కడ వేలాది కొత్త గృహాలు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: CP Radhakrishnan: నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం.. ఎన్డీఏ నేతల హాజరు
ఇక ఈ వివాదాస్పద E1 సెటిల్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే ఒప్పందంపై నెతన్యాహు సంతకం కూడా చేశారు. దీంతో ఇక పాలస్తీనా రాజ్యం ఉండదని ప్రపంచానికి సంకేతం ఇచ్చారు. జెరూసలేం తూర్పున ఉన్న ప్రాంతంలో వేలాది కొత్త గృహాల నిర్మాణం కోసం చేపట్టిన E1 ప్రణాళికకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికా సంఘం నుంచి కూడా తుది ఆమోదం లభించేసింది.
ఇది కూడా చదవండి: Charlie Kirk Murder: చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల.. వయస్సు ఎంతంటే ..!
వచ్చే యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యం గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. ఇందుకోసం కసరత్తు చేస్తుండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బాంబ్ పేల్చారు. ఇక పాలస్తీనా దేశమే ఉండబోదని ప్రకటించారు. ఒకవేళ మిత్రదేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తే మాత్రం ఇజ్రాయెల్ ఒంటరిగా నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది.
జెరూసలేంకు తూర్పున 12 చదరపు కి.మీ విస్తర్ణంలో ఉన్న స్థావరాన్ని తూర్పు 1 లేదా E 1 గా పిలుస్తారు. ఇది మాలే అడుమిమ్ ప్రక్కనే ఉంటుంది. అయితే అమెరికా, యూరోపియన్ దేశాల అభ్యంతరాల తర్వాత 2012-2020లో ఈ ప్రాజెక్ట్ స్తంభించిపోయింది. తిరిగి ఇన్నాళ్ల తర్వాత ప్రాజెక్ట్ చేపడుతున్నారు. కొత్త రోడ్లు, ప్రధాన మౌలిక సదుపాయాల కోసం దాదాపు 1 బిలియన్ USD ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా భూభాగంలో ఉన్న అన్ని ఇజ్రాయెల్ స్థావరాలను అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ఇది నాల్గవ జెనీవా కన్వెన్షన్ ఆధారంగా ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం ఈ స్థావరాలకు చట్టపరమైన చెల్లుబాటు లేదని చెబుతుంది. అయితే ఈ వాదనను ఇజ్రాయెల్ తప్పుపడుతుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం ఏ దిశగా వెళ్తుందో చూడాలి.
