ఇజ్రాయెల్-గాజా మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా బందీలు-ఖైదీల మార్పిడి జరిగింది. అయితే తొలి విడత ఒప్పందం ముగియడంతో తిరిగి ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: Fire Accident: పాతబస్తీ ప్రమాద సమయంలోనే హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. తేడా ఒక్కటే..!
అయితే గాజాలో పరిస్థితి దుర్భరంగా మారింది. పాలస్తీనియన్లు కరవు అంచుకు వెళ్లారు. దాదాపు మూడు నెలల నుంచి గాజాలోకి స్వచ్చంధ సంస్థలు తీసుకెళ్లే ఆహారాన్ని అనుమతించడం లేదు. దీంతో గాజాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గాజాలో కరవు ఆసన్నమైందని ఆహార భద్రతా నిపుణులు హెచ్చరించడంతో ప్రధాని నెతన్యాహు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సిఫార్సుల మేరకు గాజాలోకి ఆహారాన్ని అనుమతించడానికి మంత్రివర్గం అంగీకరించిందని సోమవరం అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే గాజాలో కరవు తీవ్రత ఎక్కువ కావడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే హమాస్‌కు ఆహారం అందకుండా చూడాలని నెతన్యాహు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Cyclone: అరేబియా సముద్రంలో తుఫాన్.. దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే ఆదివారం ఒక్క రోజే వైమానిక దాడుల్లో 100 మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల కారణంగా ఉత్తర గాజాలోని కీలకమైన వైద్య సదుపాయమైన ఇండోనేషియా ఆస్పత్రి మూసివేసినట్లు పేర్కొన్నారు.
మార్చిలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసిన తర్వాత ఈ మధ్య కాలంలో వరుసగా భీకరదాడులు జరుగుతున్నాయి. దీంతో గాజాలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 2023, అక్టోబర్7న హమాస్.. దక్షిణ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. నాటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. ఐడీఎఫ్ చేసిన దాడుల్లో గాజా నాశనమైంది.
