Site icon NTV Telugu

Iran-Israel: ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు

Iranisrael1

Iranisrael1

మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గత శనివారం ప్రారంభమైన యుద్ధం.. క్రమక్రమంగా తీవ్రస్థాయిలోకి వెళ్లిపోయింది. టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్, బీరూట్‌లపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసి పేల్చేయగా.. తాజాగా ఇరాన్ ఎయిర్‌పోర్టును కూడా పేల్చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల

గత రాత్రి జెరూషలేం సహా పలు నగరాల్లో సైరన్లు మోగగా లక్షలాది మంది బంకర్లలోకి వెళ్లిపోయి తలదాచుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు.. ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నాయి. ఇక ప్రతీకారంగా అర్ధరాత్రి టెహ్రాన్, బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. బీరూట్‌లో హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ‘‘సరెండర్’’, నాయకత్వ మార్పు అంశాలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు. దేశ నాయకత్వ నిర్ణయాలు అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. ఇరాన్ సరెండర్ అవుతానే యుద్ధం ఆపుతామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అందుకు ఇరాన్ నిరాకరించింది.

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా అమెరికాకు మద్దతుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ప్రస్తుతం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. పరిస్థితులు ఎక్కడ వరకు వెళ్తాయో చూడాలి.

ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య

Exit mobile version