Iran Ship Attack: ఇరాన్ యుద్ధనౌక దాడిలో “విషాద కోణం”.. కమాండర్ మొండితనానికి 87 మంది బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Ship Attack: ఇరాన్ యుద్ధం వేళ, శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి టార్పిడో దాడి చేసింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. విశాఖపట్నంలో మిలన్ నేవీ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన ఐరిస్ డేనా అనే యుద్ధ నౌక సబ్‌మెరైన్ దాడిలో మునిగిపోయింది. ఈ ఘటన సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 87 మంది మరణించగా, 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ దొరకలేదు.
అయితే, ఈ ఘటన వెనక విషాద కోణం వెలుగులోకి వచ్చింది. దాడికి ముందు ఇరాన్ యుద్ధనౌకలో ఉన్న సిబ్బంది తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. సిబ్బంది యుద్ధ నౌక విడిచిపెట్టాలని అమెరికన్ దళాలు రెండుసార్లు ఆదేశించాయని అతను చెప్పినట్లు తెలిసింది. ఈ దాడిలో ఇతను కూడా మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడించారు.
Also Read
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
- Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
- Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
హెచ్చరించినా, కమాండర్ మొండితనం:
అయితే కమాండర్ మొండితనమే పదుల సంఖ్యలో నావికుల మరణానికి కారణమైనట్లు తెలిసింది. అమెరికా దళాలు హెచ్చరిస్తున్నప్పటికీ యుద్ధనౌక కమాండర్ నావికులు నౌకను వదిలిపెట్టడానికి ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించాడు. కమాండర్, అతడి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనేక మంది నావికులు కమాండర్‌తో వాదించారు. కమాండర్ మాట లెక్క చేయని 32 మంది నావికులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా లైఫ్ బోట్ల ద్వారా యుద్ధ నౌకకు దూరంగా వచ్చారు.
దీని తర్వాత, అమెరికన్ సబ్‌మెరైన్ USS షార్లెట్ అనే లాస్ ఏంజిల్స్-క్లాస్ ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చేసింది. ఇది మార్క్ 48 టార్పెడోలను ప్రయోగించి, ఇరాన్ నౌకను ముంచేసింది. నౌక ముందు భాగానికి టార్పెడో తగిలి ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. దీనికి సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.
BREAKING: US MILITARY RELEASES VISUALS OF ATTACK ON IRAN WARSHIP IRIS DENA IN THE INDIAN OCEAN. OVER 100 IRANIAN SAILORS ARE FEARED DEAD IN THE WORST SUCH ATTACK SINCE WORLD WAR 2.pic.twitter.com/FI6zV8ao2b
— Sidhant Sibal (@sidhant) March 4, 2026
తాజావార్తలు
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
-
Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!