Iran-US: చర్చలు విఫలం కాగానే రహస్యంగా వెళ్లాల్సి వచ్చింది.. అమెరికాపై ఇరాన్ సంచలన ఆరోపణలు
- అమెరికాపై ఇరాన్ విశ్లేషకుడు సంచలన ఆరోపణలు
- ఇరాన్ బృందానికి భద్రతా ముప్పు
- రహస్యంగా ఇరాన్‌కు చేరుకున్న బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్యలు జరిగాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో దాదాపు 21 గంటల పాటు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలం కావడంతో ఎవరి దారిన వారు తిరిగి వెళ్లిపోయారు.
తాజాగా ఆ నాడు ఎదురైన పరిణామాలను ఇరాన్ రాజకీయ విశ్లేషకుడు మహ్మద్ మరాండి వెల్లడించారు. ఈ సందర్భంగా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాతో చర్చలు విఫలం కాగానే ఇరాన్ ప్రతినిధి బృందం భద్రతా ముప్పులను ఎదుర్కొందని ఆరోపించారు.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
మహ్మద్ మరాండి వివరాల ప్రకారం… అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే ఇరాన్ విమానంపై దాడి జరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష హెచ్చరికలు అందినట్లుగా తెలిపారు. ఇక చర్చలు విఫలం అయ్యాక తిరుగు ప్రయాణంలో ఇరాన్ ప్రతినిధి బృందం అత్యంత జాగ్రత్తలు తీసుకుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో మధ్యలోనే విమానం మారిపోయారని.. మరో విమానం కూడా హఠాత్తుగా మష్హాద్ నగరంలో ల్యాండ్ అయిందని చెప్పుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి బస్సులు, రైళ్లు, కార్ల ద్వారా టెహ్రాన్‌కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. తమ విమానాన్ని ఇజ్రాయెల్, అమెరికా కూల్చివేసే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు
ఇదిలా ఉంటే మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారాంతంలోనే మళ్లీ ఇస్లామాబాద్ వేదికగా చర్చలు పునఃప్రారంభం కావచ్చని పాకిస్థాన్‌లోని ఇరాన్ ఎంబసీ వర్గాలు తెలిపినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ అధికారులు కూడా ఇరాన్‌తో సంప్రదింపులు జరిపారని.. రెండో దఫా చర్చలకు ఇరాన్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కచ్చితమైన తేదీ మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈలోపే చర్చలు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Raghav Chadha: రాఘవ్ చద్దాకు అండగా కేంద్రం.. జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. మొత్తానికి 40 రోజుల తర్వాత రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు ఏప్రిల్ 21తో ముగుస్తుంది.
In an interview to @MayadeenEnglish, professor @s_m_marandi states the Iranian delegation felt seriously threatened during their return from negotiations in Pakistan. The talks ended abruptly after US Vice President Vance’s intervention, coinciding exactly with the publication of… pic.twitter.com/S7pgND3Uoq
— Javed Hassan (@javedhassan) April 13, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?