Raghav Chadha: రాఘవ్ చద్దాకు అండగా కేంద్రం.. జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!
- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ కేంద్రం కీలక నిర్ణయం
- రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!
- దేశ రాజకీయ వర్గాల్లో కీలక చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు అనూహ్యంగా కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని షాకిచ్చింది. సభలో రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసింది. దీంతో రాఘవ్ చద్దా తీవ్ర షాకింగ్‌కు గురయ్యారు. అనంతరం ఆప్ నేతలు తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. మోడీకి భయపడి.. ఎయిర్‌పోర్టుల్లోని సమోసాల ధరల గురించి మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడంతో ఆప్ ప్రభుత్వం భద్రత కూడా ఉపసంహరించుకుంది.
ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భద్రత వివరాలపై అధికారిక సమాచారం వెలువడకపోయినప్పటికీ… కేంద్ర నిర్ణయం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జెడ్ కేటగిరీ..
జెడ్ కేటగిరీ (Z Category) భద్రత అనేది భారతదేశంలో తీవ్రమైన ముప్పు ఉన్న ప్రముఖులకు కల్పించే అత్యున్నత భద్రతా స్థాయిల్లో ఒకటి. ఈ భద్రతలో 22 మంది వరకు సాయుధ సిబ్బంది (4-6 మంది NSG కమాండోలతో సహా) రక్షణ కల్పిస్తారు. ఇది ప్రధానంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి ముప్పు ఉన్నవారికి మాత్రమే కల్పిస్తారు.
ఇది కూడా చదవండి: Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!