Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- ట్రంప్‌కు ఇరాన్ కీలక ఆఫర్
- 7 రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తామని సంకేతాలు!
- ట్రంప్ స్పందనపై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హార్ముజ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అమెరికా తన పోర్టులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసి, హార్ముజ్ జలసంధి చుట్టూ సైనిక ఒత్తిడిని తగ్గిస్తే.. వారం రోజుల్లోనే జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఇరాన్ అధికారి క్యోడో వార్తా సంస్థకు వెల్లడించినట్లు సమాచారం.
అమెరికా ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధనాన్ని తొలగించడంతో పాటు హార్ముజ్ వ్యూహాత్మక జలమార్గం చుట్టూ సైనిక ఒత్తిడిని తగ్గించాలని ఇరాన్ కోరుతోంది. ఈ రెండు చర్యలు తీసుకుంటే హార్ముజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని వారం రోజుల్లో పునరుద్ధరించవచ్చని ఇరాన్ అధికారి పేర్కొన్నట్లు క్యోడో తెలిపింది. దీంతో హార్ముజ్ జలసంధిలో నౌకాయాన పునరుద్ధరణను అమెరికా సైనిక చర్యలు, పోర్టులపై ఆంక్షల సడలింపుతో ఇరాన్ ముడిపెడుతున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికాపై ఇరాన్ హెచ్చరికలు..
మరోవైపు అమెరికా మరోసారి దాడులకు పాల్పడితే కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తామని, కొత్త ఆయుధాలను రంగంలోకి దింపుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించిన ఒక రోజు తర్వాత ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధంలో ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొంది. అయితే ఇరు దేశాలు మరోసారి పూర్తిస్థాయి యుద్ధంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
శనివారం ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్.. అమెరికా తమ దేశంపై కొత్త చర్యలకు సిద్ధమవుతోందని పేర్కొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. అయితే అమెరికా ఎలాంటి చర్యలకు సిద్ధమవుతోందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. గత నెల చివరిలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిన తర్వాత ఇటీవలి రోజుల్లో అమెరికా–ఇరాన్ మధ్య ప్రత్యక్ష పోరాటం కొంత తగ్గింది. అయినప్పటికీ హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు అడపాదడపా కొనసాగుతున్నట్లు సమాచారం.
హార్ముజ్ జలసంధిపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా, ఇరాన్ రెండూ తమ తమ దిగ్బంధనాలను కొనసాగిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఏర్పడుతున్న అంతరాయాలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
యెమెన్కూ విస్తరించిన యుద్ధం..
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం యెమెన్కూ విస్తరించింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు.. సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాల నుంచి మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో సౌదీ అరేబియాలోని లక్ష్యాలపై, రాజధాని రియాద్పైనా హౌతీలు దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు మధ్యప్రాచ్య యుద్ధం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫిబ్రవరి చివరిలో అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 10 శాతానికి పైగా క్షీణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ స్టాటిస్టికల్ సెంటర్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి చివరి నుంచి జూన్ చివరి వరకు ఉన్న కాలంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వార్షిక ప్రాతిపదికన 10.1 శాతం తగ్గింది. పర్షియన్ క్యాలెండర్ ప్రకారం ఈ కాలాన్ని ఏడాది తొలి త్రైమాసికంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని వారం రోజుల్లో తిరిగి తెరవడానికి సిద్ధమన్న ఇరాన్ సంకేతాలు.. అమెరికాతో చర్చలు, సైనిక ఒత్తిడి తగ్గింపు, పోర్టులపై దిగ్బంధనం వంటి అంశాలపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!