Iran-US Talks: చిత్తశుద్ధి లేదు.. అమెరికాతో చర్చలు ఉండబోవన్న ఇరాన్
- ఆమెరికాకు చిత్తశుద్ధి లేదు
- అమెరికా సముద్ర దొంగ
- చర్చలు ఉండబోవన్న ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం జేడీ వాన్స్ బృందం సోమవారం ఇస్లామాబాద్ చేరుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా పాకిస్థాన్ కూడా ఇస్లామాబాద్‌లో తీవ్ర ఆంక్షలు విధించింది. రాజధానిలోకి ఎవరూ రాకుండా అన్ని రహదారులు మూసేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది. అమెరికాకు చిత్తుశుద్ధి లేదని.. సముద్ర దొంగ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలకు భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవని తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్
Also Read
- Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
- Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
ఇరాన్‌పై నిందలు వేసి ఆట ఆడుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరోపించారు. వివాదాన్ని పరిష్కరించడంలో అమెరికాకు చిత్తశుద్ధి లేదని నిందించారు. ‘‘వారు సానుకూల పాత్ర పోషించడానికి బదులుగా ఈ ఆట కొనసాగుతోంది. అమెరికన్లు నిజం చెబుతారని మనం ఆశించలేము. వారు ఎల్లప్పుడూ మమ్మల్ని నిందిస్తూనే ఉంటారు.’’ అని ప్రతినిధి అన్నారు.
యురేనియం శుద్ధి అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని.. ఒప్పందం జరిగితే సంతకాలు చేసేందుకు వ్యక్తిగతంగా పాకిస్థాన్‌కు కూడా వెళ్తానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మంచి పని చేస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. ఒకవేళ ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే గత రాత్రి చైనా నుంచి ఇరాన్‌కు వస్తున్న సరుకు రవాణా నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా నౌకలపై డ్రోన్ దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనేటట్టు కనిపిస్తోంది.
తాజా పరిణామాలను చూస్తుంటే రేపు ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు లేనట్లుగానే కనిపిస్తోంది. అమెరికా బృందం ఇప్పటికే బయల్దేరగా.. ఇరాన్ బృందం మాత్రం ఇంకా బయల్దేరలేదు. దీంతో రెండు విడత చర్చలు లేనట్లుగా అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!