Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్
- ‘గాలి మేడలు కట్టొద్దు’
- ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్
- పర్షియన్ సామెత ఉపయోగించిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని వైట్‌హౌస్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB), తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యల క్లిప్‌ను పంచుకుంటూ పర్షియన్ భాషలో ట్రంప్‌ను ఎగతాళి చేసింది. గాల్లో మేడలు కట్టొద్దని హితవు పలికింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని మింగేస్తుంది. మరికొన్నిసార్లు గింజగింజగా తింటుంది!”. అని వ్యాఖ్యానించింది. వాస్తవానికి దూరంగా కలల్లో జీవించడం వంటి భావాన్ని తెలియజేస్తుంది.
ట్రంప్ ఏమన్నారంటే..
ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని బిగ్ ప్రకటన చేశారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు న్యూక్లియర్ డస్ట్ (సుసంపన్న యురేనియం నిల్వ) మాకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు.’’ అని తెలిపారు. ఈ అంశంపై రెండు దేశాలు ఒక ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు.. ఒకవేళ ఒప్పందం ఇస్లామాబాద్‌లో జరిగితే పాకిస్థాన్‌కు కూడా వెళ్తానని ట్రంప్ సూచించారు.
Also Read
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య 21 గంటల పాటు చర్చ జరిగింది. అయితే చర్చలు ఫలించకపోవడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా.. ఇరాన్ ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అంగీకరిస్తామని తెగేసి చెప్పింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా నిర్దేశించిన “రెడ్ లైన్స్” పాటిస్తే ఈ ఒప్పందం రెండు దేశాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని.. అంతే తప్ప అణు ఆయుధాలు తయారు చేసే ఉద్దేశ్యం లేదని పేర్కొంది.
అయితే రెండో విడత చర్చల కోసం వాషింగ్టన్ ఆదేశాల మేరకు ఇరాన్ ఒప్పించేందుకు పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి టెహ్రాన్‌లో కీలక నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. గురువారం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిభాఫ్‌తో సమావేశమై శాంతి చర్చలపై చర్చించారు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. అసిమ్ మునీర్.. రివల్యూషనరీ గార్డ్స్ కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి ఇరాన్ కమాండర్లతో కీలక అంశాలపై చర్చించారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇతర నాయకులతో కూడా సమావేశమయ్యారు. అయితే రెండో విడత చర్చలపై మాత్రం ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇక ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది.
Building castles in the air!
Or in Persian we have a similar proverb:
'The camel dreams of cottonseed; sometimes gulping it down, sometimes eating it grain by grain!'شتر در خواب بیند پنبهدانه
گهی لپلپ خورد گه دانه دانه pic.twitter.com/HA15h1aQVU— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 16, 2026
తాజావార్తలు
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
-
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?