ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లలను ప్రయోగించింది. అయితే ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ అన్నారు. ఇరాన్ 100కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Donald Trump: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని నాకు ముందే తెలుసు..
శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై దాడి చేసింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల శబ్ధానికి ప్రజలంతా భయాందోళనతో మేల్కొ్న్నారు. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ టెలివిజన్ కూడా పేలుడు శబ్ధాన్ని గుర్తించింది.
ఇది కూడా చదవండి: Air India plane crash: విమానం చివరి క్షణాల్లో పైలట్లు ఏం చేసి ఉండొచ్చు..?
ఇదిలా ఉంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై 200 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 లక్ష్యాలను ఎంచుకోగా.. విజయవంతంగా ఇజ్రాయెల్ ముగించింది. ఈ దాడుల్లో ఇరాన్‌లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాకుండా ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి కూడా మరణించారు. ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది. అంతేకాకుండా ఐడీఎఫ్ కూడా ధృవీకరించింది.
ఇక బాఘేరి టెహ్రాన్‌లో జన్మించారు. 2016 నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఇది దేశంలో అత్యున్నత సైనిక పదవి. మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో నిపుణుడు. 1980లో ఐఆర్‌జీసీలో చేరి ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పోరాడారు. పొలిటికల్ జియోగ్రఫీలో ఆయన పీహెచ్‌డీ చేశారు. జనరల్ స్టాఫ్‌లో ఇంటెలిజెన్స్ మరియు ఆపరేషన్ల కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న బాఘేరి జూన్ 28, 2016న సాయుధ దళాల జనరల్ స్టాఫ్ (AFGS) కొత్త ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఇరవై ఏడు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న హసన్ ఫిరోజబాది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇక బాఘేరి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించాయి.
