Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు
- ఆ తర్వాత కానిస్టేబుల్ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patna Shocker: బీహార్ రాజధాని పట్నాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దానాపూర్‌లోని నాస్రీగంజ్ మిథిలా కాలనీలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన సోదరిపై సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపి, అనంతరం తానూ కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో అన్నాచెల్లెలిద్దరూ మృతి చెందారు. మృతుడిని ఓం చంద్రగా పోలీసులు గుర్తించారు. ఆయన బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రస్తుతం మోతిహారిలో విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలిని తన సోదరి పార్వతి కుమారిగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో దానాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు వ్యక్తులకు తుపాకీ గాయాలైనట్లు సమాచారం అందింది. వెంటనే పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రాథమిక దర్యాప్తులో ఓం చంద్ర తన సోదరి పార్వతి కుమారిపై కాల్పులు జరిపిన అనంతరం, తన సర్వీస్ రివాల్వర్‌తో తానూ కాల్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాల కారణంగా ఇద్దరూ మృతి చెందారు.
Also Read
- Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
సంఘటనా స్థలంలో సర్వీస్ రివాల్వర్, రెండు ఖాళీ తూటాలు
ఘటన అనంతరం పోలీసులు ఓం చంద్రకు చెందిన సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో రెండు ఖాళీ తూటాలను కూడా గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించి ఆధారాలను సేకరించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దానాపూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే కారణమా?
పట్నా వెస్ట్ సిటీ ఎస్పీ సంకేత్ కుమార్ ప్రకారం.. ఘటనకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కారణాలు తెరపైకి వస్తున్నాయి. పార్వతి కుమారి మానసిక పరిస్థితి సరిగా లేదనే సమాచారం కూడా పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులకు అసలు కారణం ఏమిటన్నది ఇప్పటివరకు పూర్తిగా స్పష్టంకాలేదు. కుటుంబ వివాదాలు సహా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు దారితీసిన అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!