Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran Hormuz Strait Internet Cable Tax Impact India Digital Banking

Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Published Date :May 11, 2026 , 3:43 pm
By Shiva Ganesh
Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Internet Crisis: అంతర్జాతీయంగా హోర్ముజ్ జలసంధి ఇప్పుడు మరోసారి హైలెట్‌గా మారింది. ఇప్పటి వరకు నౌకల రాకపోకలపై పన్నులు విధించిన ఇరాన్, ఇప్పుడు ప్రపంచ దేశాల డేటాపై కన్నేసిందని సమాచారం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధంగా ఉన్న ‘తస్నిమ్’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. హోర్ముజ్ జలసంధి కింద ఉన్న ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లపై ఇరాన్ భారీగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది.

10 ట్రిలియన్ డాలర్ల లావాదేవీలు
నిజానికి చాలామంది ఇంటర్నెట్ అనేది ఉపగ్రహాల ద్వారా నడుస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రపంచంలోని 95% నుంచి 97% డేటా సముద్రపు అడుగున ఉండే ఫైబర్-ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రసారం అవుతుంది. హోర్ముజ్ జలసంధి గుండా సుమారు 20కి పైగా ప్రధాన కేబుళ్లు వెళుతున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 10 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 830 లక్షల కోట్లు) ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని అంచనా. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో ఈ ప్రాంతం నుంచి దాదాపు 17% నుంచి 30% వెళ్తుంది. ఇప్పుడు ఈ కేబుళ్లపై పన్ను వేయడం ద్వారా ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాలని ఇరాన్ భావిస్తోందని సమాచారం.

Also Read

  • Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
  • Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!
Add as a preferred
source on google

భారతదేశానికి ప్రమాదం ఎందుకంటే..
ఈ పరిణామం భారతదేశానికి అత్యంత ఆందోళనకరం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి ఐరోపాకు వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 60 శాతం ముంబై – రెడ్ సీ మార్గాల ద్వారానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ పన్నులు విధించిన, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ కేబుళ్లకు నష్టం వాటిల్లిన భారత్‌లో డిజిటల్ సేవలు కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇంటర్నెట్ కేబుల్లకు ఏదైనా జరిగితే బ్యాంకింగ్, యూపీఐ (UPI) చెల్లింపులు, క్లౌడ్ సేవలు, ఆన్‌లైన్ ట్రేడింగ్, ఐటీ కంపెనీల కార్యకలాపాలు తీవ్రంగా నష్టపోతాయి. భారత్ తన మిగతా 40 శాతం డేటాను చెన్నై నుంచి సింగపూర్, పసిఫిక్ మహాసముద్రం మార్గం ద్వారా పొందుతోంది.

కీలకమైన 5 కేబుల్ వ్యవస్థలు

భారతదేశ పశ్చిమ దేశాల కనెక్టివిటీకి ఈ ఐదు వ్యవస్థలు వెన్నెముకగా ఉన్నాయి..

AAE-1: ఆసియా-ఆఫ్రికా-యూరప్ 1

FALCON: ఫాల్కన్ నెట్‌వర్క్

TATA TGN-Gulf: టాటా గల్ఫ్ కేబుల్

SEA-ME-WE 4: ఆగ్నేయాసియా-మధ్యప్రాచ్యం-పశ్చిమ ఐరోపా 4

IMEWE: ఇండియా-మిడిల్ ఈస్ట్-వెస్ట్రన్ యూరోప్

రంగంలోకి దిగిన భారత టెలికాం దిగ్గజాలు
పరిస్థితి తీవ్రతను గమనించిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. హోర్ముజ్ – ఎర్ర సముద్రం ప్రాంతంలో కేబుళ్ల భద్రతపై ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరపాలని కోరాయి. ఒకవేళ ఇరాన్ తన పన్ను నిర్ణయాన్ని అమలు చేస్తే, భారత్‌లో ఇంటర్నెట్ ప్యాక్‌ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది జరిగిన దాడుల కారణంగా ఇప్పటికే ఐరోపాకు వెళ్లే డేటాలో 25% ప్రభావితమైనట్లు టాక్. ప్రస్తుత ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ప్రపంచం మరో డిజిటల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని విశ్లేషకలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAE-1 Cable
  • Digital Economy Threats
  • FALCON Network
  • Hormuz Strait Internet Crisis
  • India Internet Speed News

తాజావార్తలు

  • Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

  • Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!

  • Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!

  • Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్

  • Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions