Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్
- మళ్లీ దాడులు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్
- దాడులు ఆపాలని ఇప్పటికే కోరిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై కొనసాగిస్తున్న సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే గతం కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని గట్టిగా హెచ్చరించింది.
ఇరాన్ అధికారులు మాట్లాడుతూ.. “ఇజ్రాయెల్‌పై మా సైనిక చర్యలను నిలిపివేస్తున్నాం. కానీ ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్‌పై దాడులు ప్రారంభిస్తే మరింత బలమైన శక్తితో ప్రతిస్పందిస్తాం” అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇరాన్ సాయుధ దళాలు కూడా ప్రత్యేక ప్రకటనలో ధృవీకరించాయి. ప్రస్తుతం సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని.. అయితే ఈ కాల్పుల విరమణ పూర్తిగా షరతులకు లోబడి ఉంటుందని పేర్కొన్నాయి. “ఇజ్రాయెల్ దూకుడు చర్యలు లేదా దక్షిణ లెబనాన్‌పై దాడులు కొనసాగితే గతం కంటే మరింత తీవ్రమైన, విధ్వంసకర చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించాయి.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ తక్షణ కాల్పుల విరమణ కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో “ఇజ్రాయెల్- ఇరాన్ రెండూ వెంటనే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాయి. శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. అవి విజయవంతం కావాలని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్లను వెంటనే కాల్పులు ఆపాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయగా.. ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని పలు సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. దక్షిణ బీరూట్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలోనే టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగింది. లెబనాన్ రాజధానిని లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులు చేస్తామని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.
తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం తిరిగి ముదిరే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గంలో రవాణా అంతరాయాలు కొనసాగుతుండటంతో ఇంధనం, వస్తువుల సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ ప్రకటించిన కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది? ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!