US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి.
- అమెరికా సైనికులకు గాయాలైనట్లు నివేదికలు.
- మువఫ్ఫాక్ సాల్టి, ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేశామన్న ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: మిడిల్ ఈస్ట్ పరిస్థితులు విషమిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేస్తుకుంటున్నారు. శుక్రవారం రాత్రి అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాదులు చేసింది. వరసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, మిలిటరీ లాజిస్టిక్స్, భూగర్భ ఆయుధ నిల్వ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు శనివారం తెల్లవారుజామున యూఎస్ సెంట్రల్ కమాండ్ నివేదించింది.
ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. జోర్డాన్‌లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. అయితే, ఈ దాడిలో పలువురు అమెరికన్ సైనికులు గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిని యూఎస్ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము కొత్తగా దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(IRGC) శుక్రవారం ప్రకటించింది. సిరియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, జోర్డాన్‌లోని లక్ష్యాలపై దాడి చేసినట్లు ఐఆర్జిసి పేర్కొంది. అమెరికా పెట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఈ దాడుల్ని అడ్డుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది.
Also Read
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
జోర్డాన్‌లోని యూఎస్ స్థావరాలపై దాడులు:
జోర్డాన్‌లోని రాయల్ జోర్డాన్ వైమానిక దళానికి చెందిన మువఫ్పాక్ సాల్టి వైమానిక స్థావరంలో అమెరికా ప్రధాన సైనిక స్థావరం ఉంది. ఇందులో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, సహాయక దళాలు ఉన్నాయి. ఇటీవల దీనిని ఇరాన్‌పై జరగబోయే కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. టవర్ 22 అనే ఒక చిన్న సైనిక స్థావరం ఈశాన్య జోర్డాన్‌లో, సిరియా సరిహద్దుకు సమీపంలో ఉంది. ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, కింగ్ ఫైసల్ ఎయిర్ బేస్, ఇంకా అనేక ఇతర శిక్షణా మరియు సరిహద్దు స్థావరాలలో కూడా అమెరికా సైనికులు ఉన్నారు. జోర్డాన్‌లో మొత్తం 3000-4000 మంది యూఎస్ సైనికులు మోహరించి ఉన్నారు. శనివారం జోర్డాన్‌లోని రెండు స్థావరాలైన మువఫ్పాక్ సల్టీ ఎయిర్ బేస్, ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్‌లపై ఇరాన్ దాడులు చేసింది.
కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై దాడి:
ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లలో దాడులు చేస్తోంది. ముఖ్యంగా కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై విరుచుకుపడుతోంది. ఈ దాడివలో ఫైటర్ జెట్ కమాండ్ సెంటర్, డ్రోన్ హ్యాంగర్లు దెబ్బతిన్నట్లు ఇరాన్ చెబుతోంది. కువైట్‌లోని క్యాంప్ అల్-ఉదైరి, అలీ అల్-సలేం ఎయిర్ బేస్, జోర్డాన్‌లోని అల్-అజ్రాక్ ఎయిర్ బేస్, మరియు బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. తమ దాడుల వల్ల అమెరికన్ సైనికులకు ప్రాణనష్టం జరిగినట్లు ఇరాన్ చెబుతోంది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!