International Friendship Day 2022: స్నేహితుల రోజు ఎలా పుట్టింది.. ఏమిటా కథ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం’ అని చెబుతారు.. “నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ, నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.”… “మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.” ఇలా ఎన్నో సామేతాలు స్నేహం గురించి పుట్టుకొచ్చాయి.. ఇక, పాటలు, కవితలు.. కథలు.. స్నేహానికి ఉన్న ప్రాధాన్యత.. దానిలోని మాధుర్యం.. నమ్మకం, త్యాగం, గొప్పతనాన్ని చెబుతాయి.. చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి, చిరు మాట చాలు స్నేహం చిగురించటానికి, ఒక్క స్నేహితుడు చాలు జీవితం మారటానికి.. అలా చిరునవ్వుతో ప్రారంభమయ్యే స్నేహతం.. బెస్ట్ ఫ్రెండ్‌షిప్ వైపు కూడా అడుగులు వేస్తుంది. స్నేహానికి ఒక్క రోజు మాత్రమే సరిపోదు.. కానీ, ఒక్కో దేశంలో.. ఒక్కో రోజు.. ఒకసారి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం, మరోసారి జాతీయ స్నేహితుల దినోత్సవం అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ఇంతకీ.. స్నేహితుల దినోత్సవం ఎందుకు..? ఎక్కడ..? ఎలా? పుట్టింది..? ఏ ఏ దేశంలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారో ఓసారి పరిశీలిద్దాం..
Read Also: Kishan Reddy: నాలుగు రోజులపాటు ఢిల్లీకి వెళ్లి సీఎం ఏం చేసారు..?
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్‌ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
సాధారణంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు… స్నేహం విలువతెలిపే కార్డులు, బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.. అయితే, 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. 1997 లో యునైటెడ్ నేషన్స్ “స్నేహం” యొక్క ప్రపంచ అంబాసిడర్ “విన్నీ ది పూః”. స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇక, ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్నిమసాచుసెట్స్, ఓహియో, న్యూ హాంప్షైర్, యునైటెడ్ స్టేట్స్ లో జూన్ 30వ తేదీనే నిర్వహిస్తారు..
నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్ వ్యూహాలతో మొదలైంది. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అంతే కాదు హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్ హాల్ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్ కార్డులు మార్కెట్లోకి పంపారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.. ఇక, 1997 లో యునైటెడ్ నేషన్స్ “స్నేహం” యొక్క ప్రపంచ అంబాసిడర్ “విన్నీ ది పూః”. నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు, వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే సంస్థ 1958లో పరాగ్వేలో జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు దానిని పాటించడం మొదలుపెట్టాయి. 2011లో ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. మరోవైపు, అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20వ తేదీన నిర్వహిస్తుండగా.. భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ దేశాలు అయితే, ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి..
ఈ సృష్టిలో.. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న లాంటి బంధాలను ఒక మనిషి సృష్టించుకోలేడు.. కానీ, తనస్నేహితులను మాత్రం తనే ఎంచుకుంటాడు.. ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. తప్పు చేసినప్పుడు మందిలించి సంరక్షునిలా రక్షిస్తూ వారికి దారి చూపే వాడే నిజమైన స్నేహితుడు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహమే అంటే అతిశయోక్తి కాదు… స్నేహితులు అనే వారు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకుని ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు… అంతెందుకు.. కొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను, సమస్యలను ఆత్మీయ స్నేహితులతో మోహమాటం లేకుండా షేర్ చేసుకుంటారు.. అలాంటి స్నేహాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయకూడదు.. కానీ, ఇలాంటి రోజులు.. వారిలో మరింత ఉత్సాహాన్నే నింపుతాయి.. సెలబ్రేట్ చేసుకోవడానికి మరో రోజును అదనంగా ఇస్తాయనే చెప్పుకోవాలి.. స్నేహమా వర్ధిల్లు… ఈ బంధంలో ఎన్నో సమస్యలను రూపుమాపు..
తాజావార్తలు
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..