China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
- చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి తయారీ సరకు..
- పట్టుకున్న ఇండోనేషియా నేవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న ఓ నైకను ఇండోనేషియా నేవీ సీజ్ చేసింది. అనుమానాస్పదంగా ఉన్న ఈ నౌకలో రాకెట్లు, క్షిపణులు, ప్రొపెల్లెంట్ తయారీలో వాడే 405 టన్నుల సోడియం పర్క్లోరేట్ రసాయనాన్ని గుర్తించారు. రిజస్ట్రేషన్ లేని లక్షలాది సిమ్ కార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు బంగ్లాదేశ్‌కు ఎందుకు తరలిస్తున్నారు? ఎవరికి అందించాలని భావిస్తున్నారు? అనే దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.
అనుమానాస్పదంగా నౌక..
కొమొరోస్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న MV స్టార్ లైన్స్ అనే నౌక చైనాలోని లియాన్యుంగాంగ్ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టుకు వెళ్తోంది. నవంబర్ 7న ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో బెలావన్ సమీపంలో ఆ నౌకను నేవీ అడ్డుకుంది. బెలావల్ సముద్ర ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన ప్లాన్‌లో లేని ఒక నౌక ఆగినట్లు ఇండోనేషియా నేవీ గుర్తించింది. రేడియో ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ నౌక సిబ్బంది నుంచి స్పందన రాలేదు. ప్రయాణ సమయంలో నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)ను కూడా నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నౌకలోని 36 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో 15 కంటైనర్లలో 405 టన్నుల సోడియం పర్క్లోరేట్ లభించింది.
Also Read
- India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
- Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
- Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
- Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
నౌకలో లభించిన సోడియం పర్‌క్లోరేట్‌ను రాకెట్లు, క్షిపణుల్లో ఘన ఇంధన ప్రొపెల్లెంట్గా వాడుతారు. స్వాధీనం చేసుకున్న ఈ రసాయనిక పదార్థంలో సుమారు 100 క్షిపణులు తయారు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే నౌకలోని 54 ప్యాలెట్లలో లక్షలాది ఖాళీ 4G LTE సిమ్ కార్డులు కూడా లభించాయి.
బంగ్లాదేశ్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారు..?
బంగ్లాదేశ్‌లో మందుగుండు సామాగ్రి, తేలికపాటి ఆయుధాల తయారీకి సంబంధించిన రక్షణ పరిశ్రమలు ఉన్నప్పటికీ, క్షిపణులు-రాకెట్ తయారీ మౌలిక సదుపాయాలు అక్కడ లేవు. అయినప్పటికీ ఇంత భారీ మొత్తంలో ఈ రసాయనాన్ని ఎందుకు తరలిస్తున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ సరకు ఎవరికి చేరుతుందనే వివరాలపై ఇండోనేషియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
-
West Bengal: పశ్చిమ బెంగాల్ పేరు మార్పు.. ఇకపై ‘‘పశ్చిమ బంగా’’
-
Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్‌కు తెర.. బడా ఛానెల్స్‌కు షాక్
-
Krishna Water Dispute: కృష్ణా జలాలపై మళ్లీ రగడ.. ఏపీకి తెలంగాణ స్ట్రాంగ్ కౌంటర్
-
Telangana Global Summit: గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!