Meta Layoff: “నా గుండె ఆగినట్టయింది”.. ఉద్యోగం పోయిన భారతీయ సంతతి మహిళ ఆ’వేదన’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian-origin employee suffering over Meta layoff: ఐటీ రంగంలో సంక్షోభం ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్విట్టర్, మెటా, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఫేస్ బుక్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఏకంగా 13 శాతం మంది ఉద్యోగులను అంటే 11,000 మందిని తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐటీ రంగంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఇక దేశీయ కంపెనీల వంతు వస్తుందని చాలా మంది టెకీలు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే మెటా నుంచి తొలగించిన తర్వాత పలువురు ఉద్యోగులు తమ ఆవేదనను పంచుకుంటున్నారు. ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే చెప్పాలని వేడుకుంటున్నారు.
Read Also: T20 World Cup: ఇండియా ఓటమిపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఏమన్నారంటే..
Also Read
ఇదిలా ఉంటే మెటా నుంచి తొలిగింపు తర్వాత భారతీయ ఉద్యోగులు తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వి. హిమాన్షు అనే ఉద్యోగి మెటా ఉద్యోగం కోసం భారత్ నుంచి కెనడా వెళ్లిన తర్వాత ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే ఉద్వాసన పలికింది సదరు కంపెనీ. తను లింక్డ్ ఇన్ లో చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో భారత సంతతి ఉద్యోగి అన్నెకా పటేల్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది.
మెటర్నిటీ లీవ్ లో ఉన్న కమ్యూనికేషన్ మేనేజర్ అన్నెకా పటేల్ కూడా మెటా లే ఆఫ్ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన మూడు నెలల కుమార్తె కోసం ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. అయితే తన కుమార్తెకు ఆహారం ఇవ్వడానికి తెల్లవారుజామున 3 గంటకలు మేల్కొన్నానని.. ఉదయం 5.35 గంటలకు లేఆఫ్ లిస్టులో తన పేరు కూడా ఉన్నట్లు మెయిల్ వచ్చిందని..దీంతో నా గుండె జారిపోయిందని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తెలిపారు. మెటాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తీసేస్తున్నట్లు తెలియడం మెయిల్ చెక్ చేసుకోవడంతో విషయం తెలిసినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!