T20 World Cup: ఇండియా ఓటమిపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra’s Tweet on T20 World Cup Semis Debacle: భారత్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ20 వరల్డ్ కప్ కల మరోసారి చెదిరిపోయింది. సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. ఆస్ట్రేలియాలో గురువారం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచులో భారత్ ఓడిపోవడం క్రీడాభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ పై నెగ్గి ఫైనల్స్ లో పాకిస్తాన్ తో తలపడుతుందని అనుకున్న ఇండియా ఇంటిదారి పట్టింది. ఏకంగా 10 వికేట్ల తేడాతో ఓడిపోవడం ఇండియన్స్ ఫ్యాన్స్ ను మరింతగా వేధిస్తోంది.
Read Also: Meta:కెనడాలో ఐఐటీ గ్రాడ్యుయేట్ తిప్పలు.. రెండురోజుల్లోనే జాబ్ తీసేసిన మెటా
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
మొదటి 10 ఓవర్లలో ఇండియా ఇన్సింగ్స్ నత్తనడకన సాగింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహాయంతో ఇండియా గౌరవప్రదమైన 168/6 స్కోర్ చేసింది. ఇది ఇంగ్లాండ్ బ్యాటర్ల ముందు పెద్దదిగా కనిపించలేదు. భారత బౌలింగ్ చితక్కొట్టారు ఇంగ్లాండ్ ఓపెనర్ల జోస్ బట్లర్, అలెక్స్ హెల్స్. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసుకుని భారత్ పై 16 ఓవర్లలోనే విషయం సాధించారు. ఆదివారం జరగబోయే ఫైనల్స్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ తో తలపడనుంది. ఇదిలా ఉంటే భారత ఓటమిపై పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే భారత్ లోని బ్రిటన్ రాయబారి అలెక్స్ హెల్లీస్ ట్వీట్ చేశారు. ‘‘ఈ విజయంపై షాక్ అయినట్లు, ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని’’ ట్వీట్ చేశాడు.
It’s not the losing that hurts, but the manner of losing…
The shifting winds of sport can be cruel…
Well, we’ll look at it as just another opportunity to Rise… https://t.co/TwQGtBX0Sq— anand mahindra (@anandmahindra) November 10, 2022
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా భారత్ ఓటమిపై స్పందించారు. భారతదేశ ఓటమి తీరు పలువురు క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. దీంతో ట్విట్టర్ ద్వారా ఓటమిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా. ‘‘ఓడిపోవడం బాధ కలిగించేది కాదు.. ఓడిపోయే విధానం.. మారుతున్న పరిస్థితులు క్రూరంగా ఉంటాయని..సరే, మేము దానిని ఎదగడానికి మరో అవకాశంగా చూస్తాము’’ అని ట్విట్టర్ లో కామెంట్ చేశారు.
I am, to use the vernacular, gobsmacked.
Never thought this would happen
— Alex Ellis (@AlexWEllis) November 10, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!